మత్తుకు బానిస.. ఏకంగా ఇంట్లోనే గంజాయి సాగు, టెక్కీ గుట్టురట్టు చేసిన పోలీసులు

Siva Kodati |  
Published : May 23, 2023, 06:37 PM IST
మత్తుకు బానిస.. ఏకంగా ఇంట్లోనే గంజాయి సాగు, టెక్కీ గుట్టురట్టు చేసిన పోలీసులు

సారాంశం

ఓ టెక్కీ ఏకంగా ఇంటిలోనే గంజాయి తోట సాగు చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. అతను నివసిస్తున్న ఇంటి నుంచి మత్తు లాంటి వాసన వస్తూ వుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

గంజాయి, డ్రగ్స్ ముఠాలకు అడ్డుకట్ట వేయాలని ఓ వైపు హైదరాబాద్ పోలీసులు ప్రయత్నిస్తుండగా ఓ టెక్కీ ఏకంగా ఇంటిలోనే గంజాయి తోట పెట్టేశాడు. వివరాల్లోకి వెళితే.. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో గంజాయి సాగు చేస్తుండగా పోలీసులకు సమాచారం అందింది.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దాడి చేసి ఆ యువకుడిని అదుపు చేశారు. అతని పేరు రేవంత్‌ అని.. ఇతను ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు.

నిందితుడికి గంజాయి సేవించే అలవాటు వుండటంతో , గంజాయి విత్తనాలను తీసుకొచ్చి ఇంట్లోనే నాటాడు. అయితే అతను నివసిస్తున్న ఇంటి నుంచి మత్తు లాంటి వాసన వస్తూ వుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఈ టెక్కీ గుట్టురట్టు అయ్యింది. రేవంత్ వద్ద నుంచి పది గంజాయి మొక్కలు, 3 గంజాయి విత్తన ప్యాకెట్లు, 300 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?