గన్‌మెన్లతో తిరిగే అధికారిని నేనేం చేస్తాను: కేసుపై స్పందించిన డింపుల్ హయతి

Published : May 23, 2023, 04:51 PM IST
గన్‌మెన్లతో  తిరిగే అధికారిని  నేనేం చేస్తాను:  కేసుపై  స్పందించిన డింపుల్ హయతి

సారాంశం

ట్రాఫిక్ డీసీపీ  రాహుల్ హెగ్డే  కారును  తాను ఢీకొట్టినట్టుగా  రుజువులు  చూపాలని  సినీ నటి డింపుల్ హయతి  డిమాండ్  చేశారు. తనపై తప్పుడు  కేసు పెట్టారన్నారు.   

హైదరాబాద్: గన్ మెన్లను  పెట్టుకుని తిరిగే అంత పెద్ద  ఆఫీసర్ ను తాను  ఏం చేస్తానని   సినీ నటి  డింపుల్ హయతి  ప్రశ్నించారు.ట్రాఫిక్ డీసీపీ  రాహుల్ హెగ్డే  డ్రైవర్  చేతన్ ఫిర్యాదు మేరకు  జూబ్లీహిల్స్  పోలీస్  స్టేషన్ లో  కేసు నమోదైంది. ఈ విషయమై  సినీ నటి డింపుల్ హయతి  ఆడియో మేసేజ్  పంపారు.

తాను  ప్రభుత్వ అధికారుల విధులకు  ఆటంకం కల్గించలేదన్నారు. ట్రాఫిక్  డైవర్షన్ కోసం  ఉపయోగించే కోన్స్ ను  అపార్ట్ మెంట్ లోకి  ఎలా వచ్చాయని  ఆమె  ప్రశ్నించారు.   పబ్లిక్ ప్రాపర్టీ  ప్రైవేట్  అపార్ట్ మెంట్ లోకి ఎలా వచ్చిందని ఆమె అడిగారు. 
 
తన కారుతో  డీసీపీ  రాహుల్  హెగ్డే కారును ఢీకొడితే  రెండు వైపులా  వాహనాలు డ్యామేజీ  అవుతాయన్నారు. కానీ  అలా జరగలేదన్నారు.  డీసీపీ వాహనానికి  ఏదైనా  ప్రమాదం జరిగి ఉండొచ్చన్నారు. తాను  డీసీపీ  వాహనాన్ని ఢీకొట్టినట్టుగా  రుజువులు  చూపాలని  ఆమె  డిమాండ్  చేశారు.తనపై తప్పుడు  కేసులు పెట్టారని  ఆమె  చెప్పారు. ఈ  విషయమై  మీడియాకు  పూర్తి సమాచారం  త్వరలోనే విడుదల చేస్తానన్నారు. 

హైద్రాబాద్ జర్నలిస్ట్ కాలనీలోని అపార్ట్ మెంట్ లో  సినీ నటి  డింపుల్ హయతి, ట్రాఫిక్ డీసీపీ  రాహుల్ హెగ్డేలు  నివాసం ఉంటున్నారు. ఇదే అపార్ట్ మెంట్ లో  సీ1, సీ3 ఫ్లాట్స్ లలో  రాహుల్ హెగ్డే , డింపుల్ హయతి నివాసం ఉంటున్నారు.

also read:తప్పుడు కేసు, కోర్టులోనే తేల్చుకుంటాం: డింపుల్ హయతి న్యాయవాది

గత కొంత కాలంగా   వీరిద్దరి మధ్య  కారు  పార్కింగ్  విషయమై  గొడవలు  జరుగుతున్నాయి.  రెండు  రోజలు క్రితం   డీసీపీ   వాహనాన్ని  సినీ నటి  డింపుల్ హయతి   ఢీకొట్టిందని   జూబ్లీహిల్స్  పోలీసులకు ఫిర్యాదు అందింది.  డీసీపీ  డ్రైవర్ చేతన్  ఫిర్యాదు మేరకు  జూబ్లీ హిల్స్  పోలీసులు  కేసు నమోదు  చేశారు.
 

PREV
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?