స్పెషల్ క్లాసెస్ పేరుతో విద్యార్థినిని బైక్ మీద ఎక్కించుకుని, రిజర్వాయర్ మీదికి తీసుకెళ్లి.....

Published : Nov 22, 2022, 02:05 PM IST
స్పెషల్ క్లాసెస్ పేరుతో విద్యార్థినిని బైక్ మీద ఎక్కించుకుని, రిజర్వాయర్ మీదికి తీసుకెళ్లి.....

సారాంశం

స్పెషల్ క్లాసెస్ పేరుతో విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడో టీచర్. ఆమెను తన బైక్ మీద ఎక్కించుకుని రిజర్వాయర్ మీదికి తీసుకువెళ్లాడు. 

సిద్దిపేట : విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసిన ఘటన సిద్దిపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..  మండలానికి చెందిన ఓ యువతి స్థానికంగా ఓ కళాశాలలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. అదే కాలేజీలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న జనగామ జిల్లా నర్మెట్టకు చెందిన ఏనుగు రవి ఈ నెల 20న బాలికకు ఫోన్ చేసి ప్రత్యేక తరగతులు ఉన్నాయని,  కాలేజీకి రావాలి అని చెప్పాడు.

దీంతో ఆమె తన సోదరుడితో కలిసి బైక్ మీద కాలేజీకి వచ్చింది. ఆదివారం కావడం, కాలేజీ మూసి ఉండడంతో వెంటనే ఉపాధ్యాయుడికి ఫోన్ చేసింది. తాను నర్మెట నుంచి వస్తున్నానని లద్నూరు వరకు రావాలని విద్యార్థినికి సూచించాడు. యువతి తన సోదరుడితో కలిసి లద్నూరుకు వెళ్ళింది. ఉపాధ్యాయుడు చెప్పిన చోటుకు నడుచుకుంటూ వెళ్లగా.. అతడు తన బైక్ మీద ఎక్కించుకుని లద్నూరు రిజర్వాయర్ మీదికి తీసుకు వెళ్ళాడు.

ఇది గమమించిన యువతి సోదరుడు, కొంతమందితో కలిసి ఉపాధ్యాయుడిని వెంబడించి, పట్టుకున్నారు ప్రత్యేక తరగతుల పేరిట విద్యార్థినిని ఎక్కడికి తీసుకు వెలుతున్నావ్ అని ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్పాడు. దీంతో యువతి సోదరుడు మరి కొంతమందితో కలిసి ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. ఈ విషయంపై ఎస్సై నారాయణ వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.

మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు: ఫోన్ స్వాధీనం, లాకర్ పగులగొట్టిన అధికారులు

ఇదిలా ఉండగా, సెప్టెంబర్ 20న జార్ఖండ్ లో ఇలాంటి దారుణమైన ఘటనే చోటుచేసుకుంది. ఓ బాలికపై యువకుడు దాష్టీకానికి పడ్డాడు. ఆమె తనను ప్రేమిస్తోందని స్నేహితుల ముందు రుజువు చేసుకునేందుకు బాలిక మీద అత్యాచారానికి తెగబడ్డాడు. వివరాల్లోకి వెళితే…  కోయలంచల్ ధన్ బాద్ ప్రాంతానికి చెందిన కొందరు యువకుల మధ్య ఓ బాలిక విషయంలో ఇటీవల గొడవ జరిగింది. ఆమె తనను ప్రేమిస్తుందని యువకుల్లో ఒకరు చెప్పారు. దీంతో తననే ప్రేమిస్తోందని సంజయ్ అనే మరో వ్యక్తి వాదించాడు. 

అంతేకాదు, తానే ఆమె ప్రేమికుడినని నిరూపించుకుంటానని.. వారి ముందు సవాలు చేశాడు. మరుసటిరోజు బాలికకు మాయమాటలు చెప్పి పొదల్లోకి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. ఆధారాలు వీడియో తీసి స్నేహితులకు పంపించాడు. వారు ఆ వీడియోను బంధువులకు చూపించడంతో జరిగిన ఘోరం వెలుగు లోకి వచ్చింది.  బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంజయ్ ను అరెస్టు చేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఏప్రిల్ 25న కవిత కొత్త పార్టీ ఇక యుద్ధం మొదలు | Kavitha New Political Party | Asianet News Telugu
ఒక్క క్లిక్.. జీవితం మటాష్! | Hyderabad CP VC Sajjanar Warning | IPL betting | Asianet News Telugu