సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ బస్టాండ్ సమీపంలో నాటు బాంబులు కలకలం..

Published : Nov 22, 2022, 01:41 PM IST
సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ బస్టాండ్ సమీపంలో నాటు బాంబులు కలకలం..

సారాంశం

సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ బస్టాండ్ సమీపంలో నాటు బాంబులు పేలడం కలకలం సృష్టించింది. బస్టాండ్‌కు సమీపంలోని పార్కింగ్ స్థలంలో బాంబు పేలుడు శబ్దం వచ్చింది. 

సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ బస్టాండ్ సమీపంలో నాటు బాంబులు పేలడం కలకలం సృష్టించింది. బస్టాండ్‌కు సమీపంలోని పార్కింగ్ స్థలంలో బాంబు పేలుడు శబ్దం వచ్చింది. దీనిపై ఆర్టీసీ అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఆ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. అయితే బస్టాండ్‌ సమీపంలో ఐదు నాటు బాంబులను పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. నాటు బాంబులు ఉన్న వైపు ప్రజలెవరూ వెళ్లకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. 

అక్కడికి నాటు బాంబులు ఎవరూ తీసుకొచ్చారనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 
 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్