మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు: ఫోన్ స్వాధీనం, లాకర్ పగులగొట్టిన అధికారులు

By narsimha lode  |  First Published Nov 22, 2022, 1:50 PM IST

తెలంగాణ  మంత్రి  మల్లారెడ్డి  ఇంట్లో  మంగళవారంనాడు  ఉదయం  ఐటీ  అధికారులు  సోదాలు నిర్వహిస్తున్నారు.  ఢిల్లీ నుండి  వచ్చిన  ఐటీ  అధికారుల  బృందం  ఉదయం నుండి సోదాలు  చేస్తున్నారు. మల్లారెడ్డితో పాటు  ఆయన కొడుకులు,  బంధువులు,  సోదరుడి  ఇంట్లో  ఐటీ  అధికారులు సోదాలు  చేస్తున్నారు. 


హైదరాబాద్:  తెలంగాణ మంత్రి  మల్లారెడ్డి ఇంట్లో  మంగళవారంనాడు  ఉదయం నుండి  ఐటీ  అధికారులు  సోదాలు  నిర్వహిస్తున్నారు.  మంత్రి  మల్లారెడ్డి  ఆయన  సోదరుడు  గోపాల్ రెడ్డి,  అల్లుడు  రాజశేఖర్ రెడ్డి , కొడుకులు  మహేందర్ రెడ్డి,  భద్రారెడ్డి, వియ్యంకుడు  లక్ష్మారెడ్డి  ఇళ్లలో  ఐటీ సోదాలు  కొనసాగుతున్నాయి. మల్లారెడ్డి  కుటుంబానికి  చెందిన  14  విద్యాసంస్థల్లో  కూడా  ఐటీ  అధికారులు  సోదాలు  నిర్వహిస్తున్నారు.మంత్రి మల్లారెడ్డి ఫోన్ ను   ఐటీ  అధికారులు  స్వాధీనం  చేసుకున్నారు. తన  నివాసం  పక్కనే  ఉన్న  క్వార్టర్  లో  మల్లారెడ్డి పోన్ ను  స్వాధీనం చేసుకున్నారు. మంత్రి మల్లారెడ్డి  సమక్షంలోనే ఐటీ  అధికారులు  సోదాలు  నిర్వహిస్తున్నారు. 

మల్లారెడ్డి  సోదరుడు  గోపాల్ రెడ్డి  నివాసంలో కూడా  ఐటీ  అధికారులు  సోదాలు  చేశారు. అయితే  ఈ  సమయంలో  లాకర్లను ఐటీ  అధికారులు  గుర్తించారు. లాకర్లను  తెరిపించేందుకు  ఓ  వ్యక్తిని  తీసుకువచ్చి  లాకర్లను  బద్దలు కొట్టారు. రెండు  లాకర్లను ఆ  వ్యక్తి  తెరిచాడు. పోలీస్ బందోబస్తుతో  ఐటీ  అధికారులు సోదాలు  నిర్వహిస్తున్నారు.   కాలేజీలు, రియల్  ఏస్టేట్  సంస్థలకు  మల్లారెడ్డి  కొడుకు, అల్లుడు  డైరెక్టర్  గా ఉన్నారు.  మల్లారెడ్డి  కుటుంబ సభ్యులు  రియల్  ఏస్టేట్  సంస్థల్లో  పెట్టుబడులు పెట్టినట్టుగా  ఐటీ  అధికారులు గుర్తించారు. 

Latest Videos

బాలానగర్ లోని ఓ  బ్యాంకులో  మల్లారెడ్డి  కాలేజీలకు  చెందిన  బ్యాంకు ఖాతాలున్నాయి.   ఈ  బ్యాంకు  చైర్మెన్  ఇంట్లో  ఖూడా  ఐటీ  అధికారులు సోదాలు  చేస్తున్నారు. ఢిల్లీ  నుండి  వచ్చిన  ఐటీ  అధికారుల బృందం  వేర్వేరుగా సోదాలు నిర్వహిస్తున్నారు. సుమారు  50  మంది  సభ్యుల  బృందం  సోదాలు  చేస్తుంది.  

also  read:మంత్రి మల్లారెడ్డి ఇళ్లల్లో ఐటీ రైడ్స్.. ఒకేసారి 50 బృందాలతో తనిఖీలు...

ఐటీ సోదాలపై  తెలంగాణ  భవన్ లో  గ్రేటర్  హైద్రాబాద్  కు  చెందిన  ప్రజా ప్రతినిధులు   సమావేశమయ్యారు.  తాము  అన్నింటిని  ధైర్యంగా ఎదుర్కొంటామని  మంత్రి  తలసాని శ్రీనివాస్  యాదవ్  చెప్పారు.  ఐటీ  దాడులపై  తెలంగాణ మంత్రి  శ్రీనివాస్  గౌడ్ స్పందించారు.  చర్యకు  ప్రతి చర్య  ఉంటుందని  చెప్పారు. 
 

click me!