టీఆర్ఎస్ లో చేరికపై టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్. రమణ క్లారిటీ ఇవ్వలేదు. ఎల్. రమణ టిడిపికి రాజీనామా చేసి, త్వరలో టీఆర్ఎస్ లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది.
జగిత్యాల: పార్టీ తనకు మహత్తరమైన అవకాశాలు కల్పించిందని అంటూనే తాను పార్టీకి రాజీనామా చేసి, టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్. రమణ చెప్పారు ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా తనకు అవకాశం ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబుకు రుణపడి ఉంటానని ఆయన అన్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. తాను టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. కార్యకర్తలతో చర్చిస్తానని, అందరి అభిప్రాయాల మేరకు నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారు.
పార్టీ మార్పుపై ఎటువంటి ప్రతిపాదన రాలేదని అన్నారు. తాను పార్టీ మారుతానని తాను చెప్పలేదని రమణ చెప్పారు. వ్యక్తిగత విమర్శలు తాను చేయలేదని, విధివిధానాలపైనే విమర్శలూ ప్రశంసలూ చేశానని ఆయన చెప్పారు. స్వార్థ రాజకీయాల కోసం పార్టీ మార్పు ఉండదని ఆయన చెప్పారు. తన కుటుంబ బాధ్యత కూడా తనపై ఉందని ఆయన చెప్పారు. కుటుంబం కోసం ఆస్తిపాస్తులు సమకూర్చాల్సిన బాధ్యత తనపై ఉందని ఆయన అన్నారు.
undefined
తనకు తెలంగాణ అధ్యక్షుడిగా నియమించిన పార్టీకి తాను అన్యాయం చేయబోనని ఆయన చెప్పారు. టీడీపీకి తాను అన్యాయం చేయలేదని ఆయన చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వంలో జౌళి శాఖ మంత్రిగా పనిచేశానని ఆయన చెప్పారు. రెండు రోజులుగా ఆయన తన అనుచరులతో చర్చలు జరిపినట్లు ఆయన తెలిపారు. పార్టీ కార్యకర్తల నిర్ణయం మేరకే నడుచుకుంటానని ఆయన చెప్పారు.
టీడీపిలో తన శక్తిమేరకు పనిచేశానని, తన బాధ్యతలను అన్నింటినీ సక్రమం నిర్వహించానని ఆయన చెప్పారు చిన్ననాటి నుంచే తాను రాజకీయాల్లో ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రంలో అనూహ్యమైన రీతిలో రాజకీయాలు మారాయని, తాజా పరిస్థితులను బట్టి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఎన్టీఆర్ పిలుపుతో తాను టీడీపీలోకి వచ్చానని ఆయన చెప్పారు. ఎన్నికల్లో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కున్నానని ఆయన చెప్పారు.
చంద్రబాబును ఆయన ప్రశంసలతో ముంచెత్తారు. రాష్ట్ర ఆర్థిక రంగాన్ని గాడిలో పెట్టిన చంద్రబాబు వద్ద తాను పనిచేశానని ఆయన చెప్పారు. హైదరాబాదులో ప్రపంచ పటంపై చంద్రబాబు నిలిపారని ఆయన కొనియాడారు.
మంచి నిర్ణయంతో ముందుకు రావాలని తన సహచరులు చెప్పారన్నారు. పార్టీ మారుతున్నట్లు తాను ఎక్కడా చెప్పలేదన్నారు. టీఆర్ఎస్, బీజేపీ ఎలాంటి ప్రతిపాదనలు పెట్టలేదని, కానీ తాను ప్రతిపాదనల కోసం పని చేయనని, ప్రజల కోసం పని చేస్తానన్నారు. పదవుల కోసం తాను పాకులాడే వ్యక్తిని తాను కాదని, ఓటర్ మనోభావాల అనుగుణంగా పని చేస్తానన్నారు. తనవల్ల ఇబ్బందులు కలిగితే..క్షమించాలని, ఎవరు ఏ బాధ్యత ఇస్తే..అది చేయడమే తన బాధ్యత అన్నారు.
పార్టీ మారడంపై పార్టీ కార్యకర్తలను చర్చించి పూర్తి వివరాలు అందిస్తానని ఆయన చెప్పారు. ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం పాటుడుతున్నానని ఆయన చెప్పారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఓటరు తమను నమ్మి ఓటు వేసినవారికి మత వంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్ నాయకులతో తాను చర్చలు జరపలేదని చెప్పారు. ఎప్పుడూ తెలుగుదేశం పార్టీని నమ్ముకుని ముందుకు సాగానని ఆయన చెప్పారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలు పూర్తి అవాస్తవమని ఆయన చెప్పారు. మారుతున్న రాజకీయాలకు, మనోభావాలకు అనుగుణంగా మార్చుకుంటున్నట్లు తెలిపారు. అందరి ఆలోచనల ప్రకారమే నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. హుజూరాబాద్ అభ్యర్థిగా ఆ ప్రయోగం చేస్తారని భావించడం లేదని చెప్పారు.