అక్రమ సంబంధం.. ప్రియుడితో కలిసి భర్త హత్య

Published : Jun 14, 2021, 11:00 AM IST
అక్రమ సంబంధం.. ప్రియుడితో కలిసి భర్త హత్య

సారాంశం

ఆమె తీరు మార్చుకోకగా.. తమ బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించింది. ఈ క్రమంలో.. ప్రియుడు నవీన్ తో కలిసి భర్త ముత్యాలును హతమార్చేందుకు ప్లాన్ వేసింది.  

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ మహిళ ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను అతి దారుణంగా హత్య చేసింది. ఈ దారుణ సంఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే...  నల్గొండ జిల్లా మేళ్లచెరువు మండలంలోని కంది బండ గ్రామానికి చెందిన ముళ్లగిరి నాగరాణి అదే గ్రామానికి చెందిన మేరిగ నవీన్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది.

ఈ విషయం ఆమె భర్త ముత్యాలు(28)కి తెలియడంతో.. పలుమార్లు మందలించాడు. పద్దతి మార్చుకోవాలని నచ్చచెప్పాడు. అయినా.. ఆమె తీరు మార్చుకోకగా.. తమ బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించింది. ఈ క్రమంలో.. ప్రియుడు నవీన్ తో కలిసి భర్త ముత్యాలును హతమార్చేందుకు ప్లాన్ వేసింది.

పథకం ప్రకారం... ఈ నెల 7న ముత్యాలు కూలీ పనులకు వెళ్లి వచ్చి మద్యం సేవించి తన ఇంట్లో నిద్రిస్తుండగా రాత్రి 11:30 గంటల సమయంలో భార్య, ఆమె ప్రియుడు కలిసి ముత్యాలు మెడకు చున్నీ బింగించి గట్టిగా లాగి హత్యచేశారు. ఏమీ తెలియనట్లుగా ఉదయం తన భర్త గుండెపోటుతో మరణించినట్లు అందరిని నమ్మించి అంతక్రియలు జరిపించింది. 

కాగా ముత్యాలు మృతిపై కుటుంబ సభ్యులు ఆమెను నిలదీయగా హత్య చేసినట్లు ఒప్పుకొని పారిపోయింది. అనుమానంతో మృతుడి సోదరుడు వెంకటేశ్వర్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహానికి ఆదివారం తహసీల్దార్‌ దామోదర్‌రావు, సీఐ శివరామిరెడ్డి సమక్షంలో పంచనామా నిర్వహించారు. కాగా మృతుడి భార్య ఆమె ప్రియుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Kavitha Comments: అలా చేస్తేనే మహిళలల రిజర్వేషన్ బిల్ వచ్చే ఆస్కారం | Asianet News Telugu
మహిళా రిజర్వేషన్ బిల్లుపై BJP Bandaru Vijayalakshmi Reaction | Telangana | Asianet News Telugu