అసెంబ్లీ నుంచి రేవంత్, సండ్రల సస్పెన్షన్

First Published Mar 11, 2017, 8:41 AM IST
Highlights

గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగిలినందుకు శిక్ష

 

 

తెలుగుదేశం ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య తెలంగాణా అసెంబ్లీ నుంచి బహిష్కరించారు.

 

బడ్జెట్ సమావేశఆల తొలిరోజున ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తున్న  సమయంలో వీరిద్దరూ అడ్డుకున్నారని. ఇలా అడ్డుకున్నందుకు రేవంత్, సండ్రను ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేసినట్లు స్పీకర్ మధుసూదనాచారి ప్రకటించారు.

 

బడ్జెట్ సమావేశాలు ఈ నెల 27వరకు కొనసాగనున్నాయి. ప్రస్తుతం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ కొనసాగుతున్నది.

 

అయితే, టీడీపీ సభ్యుల సస్పెన్షన్ ను కాంగ్రెస్ నిరసన తెలిపింది. సభ్యలు సస్పెన్షన్ విధానానికి తాము నిరసన చెబుతున్నమని   ప్రతిపక్ష నాయకుడు జానా రెడ్డి, పిసిసి అధ్యక్షుడు ఉత్త మ్ కుమార్ రెడ్డి చెప్పారు.

 

తమ నిరసన వ్యక్తం చేస్తూ అసెంబ్లీలో భోజనాన్ని, సభా వ్యవహారాలను కాంగ్రెస్ బహిష్కరించింది.

 

తాను పదే పదే విజ్ఞప్తి చేసినా పరిగణనలోకి తీసుకోకపోవడం పట్ట జానా అగ్రహం వ్యక్తం చేశారు.

 

సోమవారం సభకు రావాలా లేదా అన్నదాని పై మరోసారి భేటీ అయి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.

 

అనంతరం ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ని కలసి టీడీపీ సభ్యులపై సస్పెషన్ ఎత్తివేయాలని కోరారు.

 

click me!