తెలుగు రాష్ట్రాలను వణికించిన ‘‘చెడ్డీ గ్యాంగ్’’ లీడర్ అరెస్ట్

Published : Aug 14, 2018, 01:12 PM ISTUpdated : Sep 09, 2018, 10:50 AM IST
తెలుగు రాష్ట్రాలను వణికించిన ‘‘చెడ్డీ గ్యాంగ్’’ లీడర్ అరెస్ట్

సారాంశం

మారణాయుధాలతో ఇళ్లపై లూటీలకు పాల్పడే ఈ అంతర్రాష్ట్ర ముఠాలోని ముగ్గురు సభ్యులను ఈ నెల మొదటి వారంలో పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. 

గత కొంత కాలం క్రితం తెలుగు రాష్ట్రాలను గడగడలాడించిన చెడ్డీ గ్యాంగ్ లీడర్ ని హైదరాబాద్ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. మారణాయుధాలతో ఇళ్లపై లూటీలకు పాల్పడే ఈ అంతర్రాష్ట్ర ముఠాలోని ముగ్గురు సభ్యులను ఈ నెల మొదటి వారంలో పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. 

 ఈ ముఠా కదలికలపై నిఘా ఉంచిన పోలీసులు పక్కా సమాచారంతో గుజరాత్ లో తలదాచుకున్నట్లు గుర్తించారు. దీంతో హైదరాబాద్ పోలీసులతో కూడిన ప్రత్యేక బృందం గుజరాత్ కు వెళ్లి స్థానిక పోలీసుల సాయంతో ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. కాగా తాజాగా ఈ ముఠా అధినేత రామ బధియాను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ చెడ్డీగ్యాంగ్ పై రెండు తెలుగు రాష్ట్రాల్లో 29 కేసులు నమోదయ్యాయి. గతంలో దొరికిన సభ్యల వద్ద నుంచి రూ.3.5లక్షల సొత్తు స్వాధీనం చేసుకోగా.. తాజాగా అరెస్టయిన నాయకుడు వద్ద నుంచి రూ.10లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నారు.

నిందితులందరూ గుజరాత్ రాష్ట్రానికి చెందినవారుగా గుర్తించారు. నిందితుల వద్ద నుంచి 300గ్రాముల విలువచేసే బంగారు ఆభరణాలు, 500గ్రాముల విలువచేసే వెండి ఆభరణాలు, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వివరించారు.

PREV
click me!

Recommended Stories

Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే
School Holidays : ఈ గురువారం స్కూళ్ళకు సెలవేనా..? ఎందుకో తెలుసా?