
సిద్దిపేట: దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం 2009లో ఏర్పడింది. అంతకుముందు దొమ్మాట అసెంబ్లీ స్థానం ఉండేది. నియోజకవర్గాల పునర్విభనలో భాగంగా దొమ్మాట స్థానంలో దుబ్బాక అసెంబ్లీ స్థానం ఏర్పడింది.
1972 నుండి ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ, టీఆర్ఎస్ లు నాలుగు దఫాలు విజయం సాధిస్తే, కాంగ్రెస్ పార్టీ మూడు దఫాలు, కాంగ్రెస్ (ఐ) ఒక్క దఫా విజయం సాధించింది.1972లో రామచంద్రారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించాడు. 1978లో కాంగ్రెస్ (ఐ) అభ్యర్ధిగా పోటీ చేసిన ఏర్నేని లింగయ్య విజయం సాధించాడు.
1983లో కాంగ్రెస్ అభ్యర్ధిగా ఏర్నేని లింగయ్య పోటీ చేసి విజయం సాధించారు. 1985లో ఈ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా డి. రామచంద్రారెడ్డి పోటీ చేశారు. ఈ స్థానం నుండి తొలిసారి టీడీపీ అసెంబ్లీలో అడుగుపెట్టింది.1989 లో టీడీపీ అభ్యర్ధిగా చెరుకు ముత్యం రెడ్డి తొలిసారిగా పోటీ చేశారు. పోటీ చేసిన తొలి ప్రయత్నంలోనే ఆయన విజయం సాధించారు.1994, 1999 ఎన్నికల్లో ఈ స్థానం నుండి చెరుకు ముత్యం రెడ్డి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి చెరుకు ముత్యం రెడ్డి గెలుపొందారు.
also read:దుబ్బాక బైపోల్: ఉత్తమ్ ఇంచార్జీగా ఉన్న గ్రామంలో టీఆర్ఎస్, బీజేపీలకే ఆధిక్యం
2004 ఎన్నికల్లో ఈ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్ధిగా సోలిపేట రామలింగారెడ్డి విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. చెరుకు ముత్యం రెడ్డిపైనే రామలింగారెడ్డి గెలుపొందారు. 2009లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చోటు చేసుకొంది. దీంతో దొమ్మాట రద్దై.. దుబ్బాక అసెంబ్లీ స్థానం ఏర్పాటైంది.
టీడీపీకి గుడ్ బై చెప్పిన చెరుకు ముత్యం రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి 2009లో ఇదే స్థానం నుండి పోటీ చేసి విజయం సాధించారు. 2014, 2018 ఎన్నికల్లో ఈ స్థానం నుండి టీఆర్ఎస్ అభ్యర్ధిగా సోలిపేట రామలింగారెడ్డి విజయం సాధించారు.
అనారోగ్యంతో సోలిపేట రామలింగారెడ్డి మరణించడంతో దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికను నిర్వహించారు.