దుబ్బాక బైపోల్: ఉత్తమ్ ఇంచార్జీగా ఉన్న గ్రామంలో టీఆర్ఎస్, బీజేపీలకే ఆధిక్యం

By narsimha lodeFirst Published Nov 10, 2020, 12:45 PM IST
Highlights

దుబ్బాక అసెంబ్లీ స్థానానికి  కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులు ఒడ్డింది. అయితే కాంగ్రెస్ పార్టీకి ఆశించిన ఫలితం దక్కలేదు.


సిద్దిపేట: దుబ్బాక అసెంబ్లీ స్థానానికి  కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులు ఒడ్డింది. అయితే కాంగ్రెస్ పార్టీకి ఆశించిన ఫలితం దక్కలేదు.

ఏడు మండలాలకు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు ఇంచార్జీలుగా వ్యవహరించారు. ప్రతి మండలంతో పాటు ఒక్కో గ్రామానికి కూడ కాంగ్రెస్ కీలక నేతలు ఇంచార్జీలుగా కొనసాగారు.

టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి లచ్చపేట గ్రామానికి ఇంచార్జీగా కొనసాగారు. ఉత్తమ్ తో పాటు ఇతర నేతలు కూడ కొన్ని గ్రామాలకు ఇంచార్జీలుగా కొనసాగారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి లచ్చపేట గ్రామానికి ఇంచార్జీగా పనిచేశారు. ఈ గ్రామంలో కాంగ్రెస్ కు ఆశించిన ఓట్లు రాలేదు. బీజేపీ, టీఆర్ఎస్ కంటే తక్కువ ఓట్లు వచ్చాయి.

also read:దుబ్బాక బైపోల్: చిట్టాపూర్‌లో సత్తా చాటిన టీఆర్ఎస్

ఈ గ్రామంలో కాంగ్రెస్ కు కేవలం 163 ఓట్లు మాత్రమే వచ్చాయి. బీజేపీకి 490 ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్ కు 520 ఓట్లు వచ్చాయి. ఈ గ్రామంలో కాంగ్రెస్ మూడో స్థానంతోనే నిలబడాల్సి వచ్చింది.

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీగా  మాణికం ఠాగూర్ ను ఎఐసీసీ నియమించింది. ఠాగూర్ రాష్ట్ర ఇంచార్జీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికలు ఇవే. గతం కంటే భిన్నంగా కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో  ప్రచారాన్ని నిర్వహించింది. కానీ ఈ ఎన్నికల్లో ఓటర్లు మాత్రం ఆ పార్టీ వైపు మొగ్గు చూపలేదు.
 

click me!