టీచర్స్ కాలనీలో వ్యభిచార గృహం.. అద్దెకు తీసుకుని వ్యాపారం.. నలుగురి అరెస్ట్..

By AN TeluguFirst Published Dec 25, 2020, 10:55 AM IST
Highlights

ఏకంగా టీచర్స్ కాలనీలోనే వ్యభిచార గృహాన్ని నడిపిస్తున్నాడో ప్రబుద్ధుడు. ఆదిలాబాద్ లో గుట్టుగా సాగుతున్న ఈ వ్యవహరం మీద పక్కా సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ దాడి చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 

ఏకంగా టీచర్స్ కాలనీలోనే వ్యభిచార గృహాన్ని నడిపిస్తున్నాడో ప్రబుద్ధుడు. ఆదిలాబాద్ లో గుట్టుగా సాగుతున్న ఈ వ్యవహరం మీద పక్కా సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ దాడి చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 

ఆదిలాబాద్‌ పట్టణంలోని టీచర్స్‌ కాలనీలోని ఓ వ్యభిచార గృహంపై గురువారం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. మావల పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని టీచర్స్‌ కాలనీలో ఓ అద్దె ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. 

పక్కా సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్‌ సిబ్బందితో ఆదిలాబాద్‌ గ్రామీణ సీఐ పురుషోత్తం కలిసి వ్యభిచార గృహంపై ఆకస్మిక దాడి చేసి మహిళ, వ్యభిచార గృహ నిర్వాహకుడు, ఇద్దరు విటులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నాలుగు సెల్‌ఫోన్లు, డైరీలు, రూ.7700 నగదు స్వాధీనం చేసుకున్నారు.

అరెస్టయిన వారిలో నిర్వాహకుడైన ప్రధాన నిందితుడు ఉట్నూర్‌ మండలం గంగన్నపేటకు చెందిన పిండి మల్లికార్జున్, విటులు కరీంనగర్‌ పట్టణంలోని రాంనగర్‌కి చెందిన సిందం కుమార్, తాంసి మండలంలోని గోట్కూరికి చెందిన దర్శనాల సాయికుమార్‌ ఉన్నారు. 

ఆర్మీలో ఉద్యోగ విరమణ చేసిన ఉట్నూర్‌ మండలం గంగన్న పేటకు చెందిన పిండి మల్లికార్జున్‌ కొంతకాలంగా ఆదిలాబాద్‌లోని టీచర్స్‌ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నిస్సహాయులైన మహిళలచే వ్యభిచారం చేయిస్తున్నట్లు వెల్లడించారు. దాడుల్లో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఎస్‌కే తాజొద్దీన్, జగన్‌సింగ్, రహాత్, మావల ఏఎస్సై గంగాధర్, కానిస్టేబుళ్లు సరిత, మౌనిక, సోనీ, తదితరులు పాల్గొన్నారు.   

click me!