అక్రమ కట్టడాలపై కొరడా ఝళిపిస్తోన్న టాస్క్‌ఫోర్స్ .. ఒక్కరోజులో 10 నిర్మాణాల కూల్చివేత

By Siva KodatiFirst Published Jan 19, 2022, 8:07 PM IST
Highlights

హైదరాబాద్‌లో (hyderabad) అనధికారిక భవనాలు, అక్రమ నిర్మాణాల (illegal constructions) విషయంలో డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్, హెచ్ఎండిఎ (hmda) యంత్రాంగం వేగం పెంచింది. పెద్ద అక్రమ నిర్మాణాలపై వేటు వేస్తోంది. బుధవారం 600 గజాలు మించిన నిర్మాణాలపై కూల్చివేత చర్యలను అధికారులు నిర్వహించారు

హైదరాబాద్‌లో (hyderabad) అనధికారిక భవనాలు, అక్రమ నిర్మాణాల (illegal constructions) విషయంలో డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్, హెచ్ఎండిఎ (hmda) యంత్రాంగం వేగం పెంచింది. పెద్ద అక్రమ నిర్మాణాలపై వేటు వేస్తోంది. బుధవారం 600 గజాలు మించిన నిర్మాణాలపై కూల్చివేత చర్యలను అధికారులు నిర్వహించారు. దీనిలో భాగంగా మరో 10 అక్రమ భవనాలను కూల్చివేశారు. వాటిల్లో ఐదు అంతస్తుల భవనాలు, రెండు ఎకరాల గోదాములు ఉన్నాయి.  మొత్తంగా మూడు రోజుల్లో 33 అక్రమ నిర్మాణాలపై టాస్క్‌ఫోర్స్ బృందాలు చర్యలు తీసుకున్నాయి.

 

 

తూముకుంట మున్సిపాలిటీ పరిధిలో ఐదు , మణికొండ మున్సిపాలిటీ పరిధిలో రెండు , శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో రెండు, పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీ పరిధిలో ఒకటి చొప్పున అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకున్నారు. బుధవారం నాటి కూల్చివేత చర్యల్లో తూముకుంట మున్సిపాలిటీ పరిధిలో 2.25 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రెండు అక్రమ నిర్మాణాలతో పాటు శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 1.20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అక్రమ నిర్మాణం ఉన్నాయి.

 

"

click me!