త్వరలో అందుబాటులోకి ఇన్సూలేటెడ్ సబ్‌స్టేషన్.. హైదరాబాద్‌లో ఇక కరెంట్ పోదు: మంత్రి జగదీశ్ రెడ్డి

Siva Kodati |  
Published : Jan 19, 2022, 05:11 PM IST
త్వరలో అందుబాటులోకి ఇన్సూలేటెడ్ సబ్‌స్టేషన్.. హైదరాబాద్‌లో ఇక కరెంట్ పోదు: మంత్రి జగదీశ్ రెడ్డి

సారాంశం

రాయదుర్గంలోని 400 కేవీ సబ్ స్టేషన్ భారతదేశంలోనే మొట్టమొదటి గ్యాస్ ఇన్సులేటెడ్  సబ్ స్టేషన్ (insulated substation) అని చెప్పారు. హైదరాబాద్ నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని.. దానికి అనుగుణంగా నగరం నలువైపులా విద్యుత్ వ్యవస్థ ను అభివృద్ధి చేస్తున్నామని జగదీశ్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ నగరంలో రాబోయే 30, 40 సంవత్సరాల అవరాలను దృష్టిలో ఉంచుకొని విద్యుత్ వ్యవస్థ ను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి వెల్లడించారు

రాయదుర్గంలోని (rayadurgam) 400 కేవీ గ్యాస్ ఇన్సూలేటెడ్ సబ్ స్టేషన్‌ను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి (jagadeesh reddy) , ట్రాన్స్‌కో జెన్కో సిఎండి ప్రభాకర్ రావు, టిఎస్ ఎస్పీడిసీఎల్ సీఎండీ రఘుమా రెడ్డి,ఇతర ఉన్నతాధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా సబ్‌స్టేషన్ ఆవరణలో మంత్రి మొక్కలు నాటారు. అనంతరం జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. రాయదుర్గంలోని 400 కేవీ సబ్ స్టేషన్ భారతదేశంలోనే మొట్టమొదటి గ్యాస్ ఇన్సులేటెడ్  సబ్ స్టేషన్ (insulated substation) అని చెప్పారు.

హైదరాబాద్ నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని.. దానికి అనుగుణంగా నగరం నలువైపులా విద్యుత్ వ్యవస్థ ను అభివృద్ధి చేస్తున్నామని జగదీశ్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ నగరంలో రాబోయే 30, 40 సంవత్సరాల అవరాలను దృష్టిలో ఉంచుకొని విద్యుత్ వ్యవస్థ ను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. హైదరాబాద్ నగరానికి విద్యుత్ వలయం ఏర్పాటు చేశామని.. దీనివల్ల ఒక్క క్షణం కూడా కరెంట్ పోదని ఆయన చెప్పారు. రింగ్ రోడ్ (ring road) చుట్టూ 400 కెవి సబ్ స్టేషన్‌లు, 220 కెవి, 133 కెవి, 33 కెవి సబ్‌స్టేషన్ లను ఏర్పాటు చేశామని జగదీశ్ రెడ్డి వెల్లడించారు. నాలుగు ఒకే ప్రాంతంలో ఏర్పాటు చేయడం దీని ప్రత్యేకత అన్నారు. ఈ నాలుగు సబ్ స్టేషన్‌లను ఏర్పాటు చేయడానికి 100 ఎకరాల స్థలం అవసరమని.. కానీ తాము 5 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. 

ఈ గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్ కు 3 కిలోమీటర్లు కేబుల్స్ అండర్ గ్రౌండ్ నుండి ఏర్పాటు చేశామని.. దేశంలో మొదటిసారి మోనో పోల్స్ కూడా తెలంగాణలోనే వాడుతున్నామని మంత్రి చెప్పారు . టీఎస్ ట్రాన్స్‌కో ఆధ్వర్యంలో నిర్మాణం చేశామని.. .పనులు చాలా వేగంగా జరిగాయని, కరోనా సహా ఎన్నో ఆటంకాలు తట్టుకొని పూర్తి చేశామని జగదీశ్ రెడ్డి తెలిపారు. ఈ సబ్‌స్టేషన్ వల్ల నగరానికి మరో 2000 మెగా వాట్స్ విద్యుత్ సరఫరా చేయవచ్చని జగదీశ్ రెడ్డి వెల్లడించారు. ఈ గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్‌ను 1400 కోట్లతో నిర్మించామని.. త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ (kcr) చేతుల మీదుగా ప్రారంభిస్తామని మంత్రి పేర్కొన్నారు. 

PREV
click me!

Recommended Stories

CM Revanth Reddy Speech: క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ | Asianet News Telugu
Ration Card: ఇక‌ రేషన్ షాప్‌కి వెళ్లాల్సిన ప‌నిలేదు.. అందుబాటులోకి కొత్త మొబైల్ యాప్