జూలై 1న బీజేపీలోకి కొండా?: మాజీ ఎంపీతో తరుణ్ చుగ్, బండి సంజయ్ భేటీ

By narsimha lodeFirst Published Jun 29, 2022, 1:22 PM IST
Highlights

మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితో బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ తరుణ్ చుగ్, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లు హైద్రాబాద్ లోని ఓ హోటల్ లో భేటీ అయ్యారు.  బీజేపీలో చేరాలని కొండా విశ్వేశ్వర్ రెడ్డిని  ఆహ్వానించారు బీజేపీ నేతలు.,ఈ విషయమై త్వరలోనే నిర్ణయం తీసుకొంటానని విశ్వేశ్వర్ రెడ్డి చెప్పినట్టుగా సమాచారం. మరో వైపు జూలై 1న బీజేపీలో విశ్వేశ్వర్ రెడ్డి చేరుతారనే ప్రచారం కూడా లేకపోలేదు.

హైదరాబాద్:మాజీ ఎంపీ Konda Vishweshwar Reddyతో బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ Tarun Chugh బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు Bandi Sanjay  బుధవారం నాడు భేటీ అయ్యారు. బీజేపీ జాతీయ కార్యవర్గసమావేశాలకు ముందే కొండా విశ్వేశ్వర్ రెడ్డితో బీజేపీ నేతలు భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరుతారా లేదా అనే విషయమై ఆయన నుండి స్పష్టమైన ప్రకటన రాలేదు. కానీ ఆయన సానుకూలంగా ఉన్నారనే ప్రచారం కూడా సాగుతుండడం గమనార్హం. అయితే ఈ ఏడాది జూలై 1 వ తేదీన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీ చేరుతారనే బీజేపీ వర్గాల్లో ప్రచారం సాగుతుంది. 

also read:కేసీఆర్ కౌంట్‌డౌన్ డిజిటల్ బోర్డు: బీజేపీకి రూ. 50 వేలు జరిమానా విధించిన జీహెచ్ఎంసీ

2019 ఎన్నికల సమయంలో చేవేళ్ల పార్లమెంట్ స్థానం నుండి  కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల్లో చేవేళ్ల పార్లమెంట్ స్థానం నుండి కొండా విశ్వేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. 2018  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు  కొండా విశ్వేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ లో చేరారు.  అయితే కాంగ్రెస్ పార్టీలో కూడా ఎక్కువ కాలం ఆయన లేరు.2021 మార్చి 15న కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేశారు. 

కాంగ్రెస్ పార్టీకి కొండా విశ్వేశ్వర్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత ఆయనతో బీజేపీ నేతలు టచ్ లో కి వెళ్లారు. చాలాకాలంగా ఆయనను బీజేపీలో చేరాలని  ఆ  పార్టీ అగ్రనేతలు కోరుతున్నారు. బీజేపీకి చెందిన కొందరు అగ్రనేతలు కూడా కొండా వి:శ్వేశ్వర్ రెడ్డితో కూడా గతంలో పలుమార్లు సమావేశమయ్యారు.  బండి సంజయ్ పాదయాత్ర సాగుతున్న సమయంలో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, బండి సంజయ్ లు కొండా విశ్వేశ్వర్ రెడ్డితో భేటీ అయ్యారు.  తాజాగా ఇవాళ హైద్రాబాద్ లోని ఓ హోటల్ లో బీజేపీ నేతలు  కొండా విశ్వేశ్వర్ రెడ్డితో భేటీ అయ్యారు.

బీజేపీలో చేరేందుకు కొండా విశ్వేశ్వర్ రెడ్డి సానుకూలంగా స్పందించారని కమలం పార్టీ  వర్గాల్లో ప్రచారం సాగుతుంది. అయితే పార్టీలో చేరడానికి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ముహుర్తం చూసుకుంటున్నారని  ప్రచారంలో ఉంది. అయితే బీజేపీజాతీయ కార్యవర్గ సమావేశాలను పురస్కరించుకొని  కమలదళం అగ్రనేతలు  హైద్రాబాద్ కు రానున్నారు. ఈ  సమయంలో బీజేపీలో చేరడం సరైన సమయంగా కమలధల నేతలు విశ్వేశ్వర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. జూలై 1న జేపీ నడ్డా హైద్రాబాద్ కు రానున్నారు. ఈ తరుణంలో జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరాలని సూచించారని తెలుస్తోంది. ఈ విషయమై త్వరలోనే తన నిర్ణయం చెబుతానని కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెప్పినట్టుగా సమాచారం. మరో వైపు జూలై 1న బీజేపీలో  కొండా విశ్వేశ్వర్ రెడ్డి  చేరే అవకాశం ఉందని బీజేపీ వర్గాల్లో ప్రచారం సాగుతుంది.

 

click me!