మళ్లీ ఫిలింనగర్ కే తాపేశ్వరం లడ్డు

By ramya neerukondaFirst Published 12, Sep 2018, 11:54 AM IST
Highlights

ఫిలింనగర్ లోని దైవసన్నిధానం దేవాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన వినాయకుడికి మహాప్రసాదంగా 600 కిలోల తాపేశ్వరం లడ్డూ రానుంది. 

ప్రతి సంవత్సరం ఖైరతాబాద్ వినాయకుడికి చేరే తాపేశ్వరం లడ్డు ఈ సారి ఫిలింనగర్ గణేశునికి చేరనుంది. గతేడాది కూడా తాపేశ్వరం లడ్డూ ఫిలింగనర్ గణేశునికే అందజేశారు.

ఫిలింనగర్ లోని దైవసన్నిధానం దేవాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన వినాయకుడికి మహాప్రసాదంగా 600 కిలోల తాపేశ్వరం లడ్డూ రానుంది. తాపేశ్వరానికి చెందిన మల్లిబాబు విరాళంగా దైవసన్నిధానం వినాయకుడికి అందించనున్న ఈ భారీ లడ్డూ బుధవారం రాత్రికి హైదరాబాద్ కు చేరనుంది. 220 కిలోల పంచదార, 145 కిలోల నెయ్యి, 175 కిలోల పచ్చిపప్పు, 25కిలోల జీడిపప్పు, 13 కిలోల బాదం, మూడు కిలోల యాలకులు, కిలో పచ్చ కర్పూరం కలిపి మహాప్రసాదం తయారు చేసినట్లు మల్లిబాబు చెప్పారు.

Last Updated 19, Sep 2018, 9:23 AM IST