లింగనిర్థారణ చేస్తున్న ముఠా అరెస్ట్.. నిందితులిద్దరూ డాక్టర్లే

By sivanagaprasad KodatiFirst Published Sep 12, 2018, 11:07 AM IST
Highlights

నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్థారణ పరీక్షలు చేస్తోన్న ముఠా గుట్టును రాచకొండ పోలీసులు రట్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. చౌటుప్పల్‌లోని ప్రశాంతి హస్పిటల్‌కు చెందిన డాక్టర్ ప్రశాంతి, డాక్టర్ శ్రీధర్, న్యూమెడ్విన్ డయాగ్నోస్టిక్స్‌ యజమాని ధనయ్యలు కలిసి ఒక ముఠాగా ఏర్పడ్డారు.

వీరు తమ వద్దకు వచ్చే వారికి గుట్టు చప్పుడు కాకుండా లింగనిర్థారణ పరీక్షలు నిర్వహించి.. పుట్టబోయేది ఆడో, మగో తెలిపారు. ఆడపిల్ల అయితే గనుక అబార్షన్ చేసేందుకు పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసేవారు. వీరి దందా గురించి రాచకొండ పోలీసులకు అజ్ఞాతవ్యక్తి వాట్సాప్ ద్వారా సమాచారం అందించాడు.

సూర్యాపేట జిల్లా వైద్య ఆరోగ్యాధికారులతో కలిసి పోలీసులు ప్రశాంతి ఆస్పత్రిపై దాడి చేసి.. డాక్టర్ ప్రశాంతి, డాక్టర్ శ్రీధర్ డయాగ్నోస్టిక్ సెంటర్ నిర్వాహకుడు ధనయ్యను అదుపులోకి తీసుకున్నారున.. దీంతో పాటు కొంత నగదు, లింగనిర్థారణ చేసేందుకు ఉపయోగించే స్కానర్, రిజిస్టర్స్, సెల్‌‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
 
click me!