లంచం తీసుకుంటూ..పట్టుబడిన మహిళా ఎస్ఐ

By ramya neerukondaFirst Published Sep 12, 2018, 11:28 AM IST
Highlights

రైతు ఎస్ఐకి నగదు అందజేస్తుండగా.. ఏసీబీ( అవినీతి నిరోదక శాఖ) అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఆమెను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
 

రైతు దగ్గర లంచం తీసుకంటూ ఓ మహిళా ఎస్ఐ అవినీతి నిరోదక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మం,, అమరారం రెవిన్యూ పరిధిలో ని భూమి పంచాయతీ విషయంలో ఓ రైతు పోలీసులను ఆశ్రయించాడు. అయితే.. ఆ రైతుకి న్యాయం చేయాలంటే.. తనకు రూ.12000 నగదు లంచంగా ఇవ్వాలంటూ స్టేషన్ ఎస్ఐ ఇస్తారమ్మ డిమాండ్ చేశారు.

కాగా.. ఈ విషయంపై బాధిత రైతు అవినీతి నిరోదక శాఖ అధికారులను ఆశ్రయించాడు. వారి పథకం ప్రకారం.. ముందుగా రూ.8వేలు ఇస్తానంటూ ఎస్ఐ తో బేరం కుదుర్చుకున్నాడు. అందులో భాగంగానే  మంగళవారం రైతు ఎస్ఐకి నగదు అందజేస్తుండగా.. ఏసీబీ( అవినీతి నిరోదక శాఖ) అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఆమెను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

మరో మూడు రోజుల్లో ఉమ్మడి నల్గొండ జిల్లా లో 54 మంది యస్ ఐ లు భదిలిలో భాగంగా ఇస్తారమ్మ  నల్గొండ కు వెళ్ళాల్సివుంది. ఈలోపు ఇలా లంచం తీసుకుంటూ అధికారులకు చిక్కింది. 

click me!