విచారణకు హాజరు కాలేనని ఈడీ అధికారులకు తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మంగళవారంనాడు ఈడీ అధికారులకు మెయిల్ ద్వారా సమాచారం పంపారు.
హైదరాబాద్: విచారణకు హాజరు కాలేనని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మంగళవారంనాడు ఈడీ అధికారులకు సమాచారం పంపారు. ఈ మేరకు ఇవాళ మెయిల్ ద్వారా ఈ సమాచారాన్ని చేరవేశారు. ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు ఈడీ విచారణను సవాల్ చేస్తూ సోమవారంనాడు తెలంగాణ హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ కారణంగా విచారణకు హాజరు కాబోనని పైలెట్ రోహిత్ రెడ్డి ఈడీ అధికారులకు మెయిల్ ద్వారా సమాచారం పంపారు.
ఈ నెల 16న తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. రెండు రోజుల పాటు ఈడీ అధికారులు రోహిత్ రెడ్డిని విచారించారు. ఈ నెల 19న ఆరు గంటలపాటు రోహిత్ రెడ్డిని విచారించారు. ఈ నెల 20న రోహిత్ రెడ్డిని ఈడీ అధికారులు విచారించారు.రెండో రోజున విచారణలో ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు విషయమై రోహిత్ రెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈ కేసుతో ఈడీ అధికారులకు ఎలాంటి సంబంధం లేదని పైలెట్ రోహిత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. మనీలాండరింగ్ జరిగితేనే ఈడీ అధికారులు విచారణ చేయాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడుతున్నారు.
undefined
ఎమ్మెల్యేల కొనుగోలు అంశానికి సంబంధించి మనీలాండరింగ్ జరగలేదన్నారు. కానీ ఈ కేసును ఈడీ ఎలా విచారణ చేస్తుందని ఆయన ప్రశ్నిస్తున్నారు. రెండు రోజుల పాటు తనను విచారించిన సమయంలో తన నుండి ఎలాంటి సమా చారం రాకపోవడంతో నందకుమార్ ను ఈడీ అధికారులు విచారిస్తున్నారని ఆయన ఆరోపించారు. నందకుమార్ నుండి అనుకూలంగా స్టేట్ మెంట్ తీసుకుని తనను కేసులో ఇరికించే కుట్ర చేస్తున్నారని కూడా రోహిత్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే . వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో ఈడీ విచారణను సవాల్ చేస్తూ నిన్న తెలంగాణ హైకోర్టులో పైలెట్ రోహిత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ కారణంగా తాను విచారణకు హాజరు కాలేనని రోహిత్ రెడ్డి ఈడీ అధికారులకు మెయిల్ పంపారు.
గతంలో రెండు రోజుల పాటు పైలెట్ రోహిత్ రెడ్డిని ఈడీ అధికారులు విచారించారు. ఇవాళ కూడా ఈడీ అధికారులు రోహిత్ రెడ్డిని విచారణకు రావాలని ఆదేశించారు.అయితే ఈ విషయమై తాను హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినందున విచారణకు రాలేనని ఆ మెయిల్ లో రోహిత్ రెడ్డి కోరాని ప్రముఖ తెలలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది. . అయితే రోహిత్ రెడ్డి రాసినప లేఖపై ఈడీ అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.గతంలోనే తనకు ఈ నెల 31వ తేదీ వరకు సమయం కావాలని ఈడీ అధికారులను కోరారు. అయితే రోహిత్ రెడ్డికి ఈడీ అధికారులు సమయం ఇవ్వలేదు.రోరోహిత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ తెలంగాణ హైకోర్టులో రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది.
also read:అన్నింటికి సిద్దంగా ఉన్నాం, భయమెందుకు: బీజేపీపై తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫైర్
మొయినాబాద్ ఫాం హౌస్ లో ఈ ఏడాది అక్టోబర్ 26న నలుగురు బీఆర్ఎస్ ెమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేస్తూ ముగ్గురు పోలీసులకు పట్టుబడ్డారు. పైలెట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామచంద్రభారతి, సింహయాజీ, నందకుమార్ లను మొయినాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేస్తున్నారని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పిర్యాదు చేశారు.