నరసింహన్ బదిలీ: తెలంగాణకు సౌందర రాజన్, హిమాచల్‌కు దత్తన్న

By narsimha lodeFirst Published Sep 1, 2019, 11:30 AM IST
Highlights

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా  సౌందర రాజన్ ను నియమించారు. తెలంగాణకు చెందిన బండారు దత్తాత్రేయ కు హిమాచల్ ప్రదేశ్ కు గవర్నర్ గా నియమించారు. 

హైదరాబాద్: తెలంగాణకు కొత్త గవర్నర్ నియమిస్తూ ఆదివారం నాడు ఉత్తర్వులు జారీ అయ్యాయి. తమిళైసాయి సౌందర రాజన్ నియమిస్తూ ఉత్తర్వులు వచ్చాయి. మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తత్రేయను  హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

కల్‌రాజ్ మిశ్రాను రాజస్థాన్ గవర్నర్ గా నియమించారు.అంతకుముందు ఆయన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్ మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయను నియమించారు.

మహారాష్ట్రకు భగత్ సింగ్ కోశ్యారిని నియమించారు. కేరళకు ఆరిఫ్ మహ్మద్ ను నియమించారు.  తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా నియమితులైన సౌందర్ రాజన్ ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన ఎన్నికల్లో డీఎంకె అభ్యర్ధి కనిమొళిపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు.ప్రస్తుతం బీజేపీకి తమిళనాడు రాష్ట్ర అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు.మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్న విద్యాసాగర్ రావు, తెలంగాణ గవర్నర్ గా ఉన్న నరసింహన్ లకు ఎక్కడ కూ డ పదవులు ఇవ్వలేదు.

తెలంగాణలో బీజేపీ బలోపేతమయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఇతర పార్టీల నుండి వలసలను ప్రోత్సహిస్తోంది. తెలంగాణలో పలు పార్టీల నుండి బీజేపీలో చేరికలు పెరుగుతున్నాయి. గ వర్నర్ బదిలీ కూడ  ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

తెలంగాణ సీఎం కేసీఆర్ తో నరసింహన్ మంచి సంబంధాలు ఉన్నాయి. అంతేకాదు సుదీర్ఘకాలం పాటు ఈ రాష్ట్రానికి గవర్నర్ గా నరసింహన్ కొనసాగారు. లడఖ్  ప్రాంతానికి నరసింహాన్ లెఫ్టినెంట్ గవర్నర్ గా పంపించే అవకాశం ఉందనే ప్రచారం కూడ సాగుతుంది.ఈ కారణంగానే ఆయనను బదిలీ చేసినట్టుగా చెబుతున్నారు.

 

సంబంధిత వార్తలు

తెలంగాణ గవర్నర్ నరసింహాన్ బదిలీ?

click me!