అంజనీ కుమార్ పై తీవ్ర వ్యాఖ్యలు: ఉత్తమ్ కుమార్ రెడ్డికి తలసాని వార్నింగ్

By telugu teamFirst Published Dec 29, 2019, 10:25 AM IST
Highlights

హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ పై తెలంగాణ పీసీసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని హెచ్చరించారు.

హైదరాబాద్: హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన తెలంగామ పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన విమర్శలపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మండిపడ్డారు. పోలీసు శాఖపై అర్థం లేని విమర్శలు చేయడం ఉత్తమ్ కుమార్ రెడ్డికి తగదని ఆయన అన్నారు. 

ఇకనైనా ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిదని ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డిని హెచ్చరించారు. హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ పై ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధ్యతారహితంగా మాట్లాడారని ఆయన అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో అంజనీకుమార్ సేవలు ప్రశంసనీయంగా ఉన్నాయని అన్నారు. 

Also Read: హైదరాబాద్ కమీషనర్ కు అసలు క్యారెక్టరే లేదు: ఉత్తమ్ ఘాటు విమర్శలు.

ర్యాలీకి అనుమతి ఇవ్వలేదనే అక్కసుతో లేనిపోని విమర్శలు చేయడం ఉత్తమ్ కుమార్ రెడ్డి దిగజారుడుతనానికి నిదర్శనమని తలసాని అన్నారు. ర్యాలీలకు, సభలకు ఆయా ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని అనుమతిస్తారని ఆయన చెప్పారు. 

అలా చేస్తే సస్పెన్షన్

మునిసిపల్ ఎన్నికల్లో తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీ నాయకులను హెచ్చరించారు. మేడ్చల్ జిల్లా నాగారంలో ఆయన ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. పార్టీ అందరినీ ఆదరిస్తుందని, సముచిత స్థానం కల్పిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. 

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు చాలా మంది ఉత్సాహం ప్రదర్శిస్తున్నారని, అయితే 20 మందికి మాత్రమే టికెట్లు కేటాయించే అవకాశం ఉందని చెప్పారు. టికెట్లు రానివారు నిరాశ చెందకూడదని, పార్టీ అభ్యర్థి విజయానికి పనిచేయాలని సూచించారు. టికెట్లు రానివారికి భవిష్యత్తులో నామినేటెడ్ పదవులు ఇస్తామని చెప్పారు.  

టీవీ ఆర్టిస్టులకు గుర్తింపు కార్డులు

రాష్ట్రంలోని టీవీ ఆర్టిస్టులకు జనవరి 4వ తేదీన హైదరాబాదులోని రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమంలో గుర్తింపు కార్లు ఇస్తామని మంత్రి తలసాని చెప్పారు. హైదరాబాదులోని మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో ఆయన ఎఫ్ డీసీ అధికారులతో సమావేశమయ్యారు. 

click me!