సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసిన జేఎన్‌జే జర్నలిస్టులు.. ‘తమ భూములను స్వాధీనం చేయాలి’

Published : Aug 19, 2023, 03:27 PM IST
సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసిన జేఎన్‌జే జర్నలిస్టులు.. ‘తమ భూములను స్వాధీనం చేయాలి’

సారాంశం

పేట్ బషీరాబాద్‌లో 25/2 సర్వే నెంబర్‌లోని 38 ఎకరాల భూమిని తమకు అందించాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసి ఏడాది గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా స్పందించలేదని, అందుకే ఏడాది కావొస్తున్న సందర్భంలో వారు కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను ఫైల్ చేశారు.  

న్యూఢిల్లీ: జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్టుల మ్యూచువల్ కో ఆపరేటివ్ హౌజింగ్ సొసైటీ(JNJ MAC HS) లిమిటెడ్‌కు పేట్ బషీరాబాద్‌లోని 38 ఎకరాల భూమిని స్వాధీనం చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసి ఏడాది కావస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం వాటిని అమలు చేసి తమకు భూములు అప్పగించడం లేదని పేర్కొన్నారు. ఏడాది గడిచిపోతున్న సందర్భంలో వారు సుప్రీంకోర్టులో ఈ నెల 14వ తేదీన కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఇందుకోసం ఢిల్లీ వెళ్లిన జేఎన్‌జే టీమ్ తమ సమస్య విషయమై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాలకు లేఖలు రాశారు.

2008లో అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 70 ఎకరాలను JNJ MAC HSకు కేటాయించింది. 70 ఎకరాల కోసం అప్పుడు ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్ విలువ ప్రకారం రూ. 12.33 కోట్లు JNJ MAC HS సభ్యులు ప్రభుత్వానికి చెల్లించారు. 70 ఎకరాల్లో మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా నిజాంపేట్‌లో 32 ఎకరాలను 2018లొ సొసైటీకి ప్రభుత్వం అప్పగించిది. కుత్బుల్లాపూర్ మండలం పేట్ బషీరాబాద్‌లోని 25/2 సర్వే నెంబర్‌లోని 38 ఎకరాలను ఇప్పటికీ ఇంకా సొసైటీకి అందించలేదు. ఈ భూమి విషయమై ఈ జర్నలిస్టులు న్యాయ పోరాటం చేస్తున్నారు. 14 ఏళ్లుగా ఇళ్ల జాగా కోసం ఎదురుచూస్తున్నారు.

గతంలో ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉండిన ఎన్వీ రమణ, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ సీటీ రవి కుమార్‌ల ధర్మాసనం విచారించి 38 ఎకరాల భూమిని JNJ MAC HSకు అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాదు, 38 ఎకరాలను స్వాధీనం చేసుకుని లే అవుట్‌లు చేసుకుని ఇళ్ల నిర్మాణం చేసుకోవచ్చని స్పష్టత ఇచ్చింది. కానీ, సుప్రీంకోర్టు తీర్పు వెలువరించినా రాష్ట్ర ప్రభుత్వం వాటిని అమలు చేయలేదు. మధ్యంతర ఉత్తర్వులనూ ఖాతరు చేయలేదు. గతేడాది తుది తీర్పు వెలువరించి తాజాగా ఏడాది గడుతుస్తున్న కారణంగా కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. 

Also Read: టికెట్ 100 శాతం నాకే వస్తుంది.. లిస్ట్ వచ్చేదాకా ఆగండి: మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి

ఈ నెల 9న ఢిల్లీ వెళ్లిన జేఎన్‌జే టీమ్ కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు, ప్రధాని మోడీకి, హోం మంత్రి అమిత్ షాలకు లేఖ రాసింది. తమ భూములను స్వాధీనం చేసేలా చర్యలు తీసుకోవాలని కోరింది.

అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికీ ఈ టీమ్ విజ్ఞప్తి చేసింది. తమ భూములను అప్పగించాలని కోరింది.

PREV
click me!

Recommended Stories

డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!
హైదరాబాద్‌లో 72 అంత‌స్తుల బిల్డింగ్‌.. ఎక్క‌డ రానుందో తెలుసా.? ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్ ఖాయం