వెనుక గేటు నుండి వచ్చి ఎమ్మార్వో విజయా రెడ్డిని సజీవ దహనం చేసిన సురేష్

By narsimha lode  |  First Published Nov 6, 2019, 7:44 AM IST

తహసీల్దార్ విజయా రెడ్డి సజీవ దహనం కేసులో పోలీసులు కీలక ఆధారాలను సేకరిస్తున్నారు. విజయా రెడ్డిని సజీవ దహనం చేసిన సురేష్ ఎమ్మార్వో కార్యాలయానికి ఎలా వచ్చాడు, ఎలా వెళ్లిపోయాడనే విషయమై ఆరా తీస్తున్నారు.


హైదరాబాద్: అబ్దుల్లాపూర్‌మెట్టు ఎమ్మార్వో విజయా రెడ్డిని సజీవ దహనం చేసిన కేసులో పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. ఎమ్మార్వో కార్యాలయానికి సురేష్ ఎలా వచ్చారు, ఎంత సేపు ఉన్నారనే విషయమై ఆరా తీస్తున్నారు.తహసీల్దార్ కార్యాలయంలో విజయా రెడ్డిని హత్య చేసిన తర్వాత సురేష్ రోడ్డుపై నడ్చుకొంటూ వెళ్లిన విషయాన్ని పోలీసులు సీసీటీవీ దృశ్యాలను సేకరించారు.

Also read:tahsildar Vijaya Reddy: అందుకే పెట్రోల్ పోసి నిప్పంటించానని సురేష్

Latest Videos

undefined

హయత్‌నగర్ మండలం గౌరెల్లి గ్రామానికి చెందిన సురేష్ కొంత కాలంగా రియల్ ఏస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఈ వ్యాపారం చేసే క్రమంలో పలు దఫాలు అబ్దుల్లాపూర్‌మెట్టు గ్రామానికి వచ్చినట్టుగా పోలీసులు సమాచారాన్ని సేకరించారు.

తహసీల్దార్ కార్యాలయంలో ఏ ఉద్యోగి ఎక్కడ ఉంటారు, ఎవరు ఏ సమయంలో ఏం చేస్తారనే సమాచారాన్ని సురేష్ పక్కాగా సేకరించినట్టుగా పోలీసులు గుర్తించారు.అబ్దుల్లాపూర్‌మెట్టు కార్యాలయంలో సీసీ కెమెరాలు లేని విషయాన్ని కూడ సురేష్ తనకు అనువుగా ఉంటుందని భావించినట్టుగా పోలీసులు భావిస్తున్నారు.

సోమవారం నాడు గ్రీవెన్స్ సెల్ డే ఆ రోజున తహసీల్దార్ కార్యాలయంలో రైతులు, ప్రజలు ఎక్కువగా వస్తారు. అదే రోజున తాను ఎమ్మార్వోపై దాడికి ప్లాన్ చేసినట్టుగా పోలీసులు భావిస్తున్నారు.

Also Read:విజయారెడ్డి హత్య వెనుక టీఆర్ఎస్: కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

అబ్దుల్లాపూర్‌మెట్టు తహసీల్దార్ కార్యాలయం ముందు గేటు నుండి కాకుండా వెనుక గేటు  నుండి సురేష్ కార్యాలయం లోపలికి వెళ్లాడు.పెట్రోల్ క్యాన్‌తో పాటు మొదటి అంతస్తుకు చేరుకొన్నాడు.లంచ్ బ్రేక్ లో తహసీల్దార్ చాంబర్ వద్ద సిబ్బంది ఎవరూ లేరు. ఈ సమయాన్ని తనకు అనుకూలంగా సురేష్ ఎంచుకొన్నాడు.

ఎమ్మార్వో చాంబర్ లోకి వెళ్లి విజయా రెడ్డితో గొడవకు దిగి ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.  ఆ తర్వాత ఎమ్మార్వో కార్యాలయం నుండి నడుచుకొంటూ వెళ్లిపోయాడు.

అబ్దుల్లాపూర్‌మెట్టు ఎమ్మార్వో కార్యాలయానికి వచ్చే ముందే ఓ పెట్రోల్ బంక్ వద్ద రెండు లీటర్ల పెట్రోల్ ను సురేష్ కొనుగోలు చేశాడు.ఈ పెట్రోల్‌ను రెండు లీటర్ల బాటిల్ తో ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లే సమయంలో కూడ ఎవరూ ఎందుకు గుర్తించలేదా.. గుర్తించినా కూడ అలానే వదిలేశారా అనే విషయమై కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


 

click me!