బిర్యానీ తిన్న పాపానికి... కుటుంబం మొత్తం...

By telugu teamFirst Published Nov 6, 2019, 7:37 AM IST
Highlights

 రెండ్రోజుల క్రితం వనస్థలిపురం, ఎన్జీవోస్‌ కాలనీకి చెందిన ఉమా, శ్రీనివాస్‌ దంపతులు హోటల్‌ మిస్టర్‌ పులావ్‌ నుంచి బిర్యానీని ఆర్డర్‌ చేశారు. ఇది తిన్న కుటుంబ సభ్యులందరికీ రాత్రంతా వాంతులు, విరేచనాలు కావటంతో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సపొందారు. సోమవారం జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు.

హైదరాబాదీ బిర్యానీ ఎంత ఫేమస్సో అందరికీ తెలుసు. నగరంలోని గల్లీ గల్లీలో ఓ బిర్యానీ పాయింట్ ఉంది. ఒక్కో బిర్యానీది ఒక్కో రుచి. దానిని తినడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. కాగా.... అలా ఎంతో ఇష్టమని బిర్యానీ తిన్న పాపానికి ఓ కుటుంబం అనారోగ్యం పాలైంది. నెక్స్ట్ సీన్ లో సదరు బిర్యానీ హోటల్ కి జీహెచ్ఎంసీ అధికారులు రూ.50వేలు జరిమానా విధించారు. ఈ సంఘటన వనస్థలీపురంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే....అపరిశుభ్ర వాతావరణంలో హోటల్‌ను నిర్వహిస్తున్న యజమానులకు జీహెచ్‌ఎంసీ అధికారులు మంగళవారం రూ.50 వేల జరిమానా విధించారు. వనస్థలిపురం, ఎన్జీవోస్‌ కాలనీ ప్రధాన రోడ్డులో  ముగ్గురు కలిసి మిస్టర్‌ పులావ్‌ హోటల్‌ను నిర్వహిస్తున్నారు. 

అయితే.. రెండ్రోజుల క్రితం వనస్థలిపురం, ఎన్జీవోస్‌ కాలనీకి చెందిన ఉమా, శ్రీనివాస్‌ దంపతులు హోటల్‌ మిస్టర్‌ పులావ్‌ నుంచి బిర్యానీని ఆర్డర్‌ చేశారు. ఇది తిన్న కుటుంబ సభ్యులందరికీ రాత్రంతా వాంతులు, విరేచనాలు కావటంతో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సపొందారు. సోమవారం జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు.

 ఈ మేరకు జీహెచ్‌ఎంసీ ఉప కమిషనర్‌ మారుతి దివాకర్‌రావు సిబ్బందితో కలిసి మిస్టర్‌ పులావ్‌ హోటల్‌లో తనిఖీలు చేపట్టారు. అందులో అపరిశుభ్ర వాతావరణంతో పాటు, నిల్వ ఉంచిన కూరగాయలు, మాంసాన్ని గుర్తించారు. ఆగ్రహించిన ఉప కమిషనర్‌ సదరు హోటల్‌ నిర్వాహకులకు నోటీసులను జారీ చేసి రూ.50 వేల జరిమానాను విధించారు. 

నిర్ణీత సమయంలో జరిమానా చెల్లించకుంటే హోటల్‌ను సీజ్‌ చేస్తామని ఉప కమిషనర్‌ మారుతి దివాకర్‌రావు నిర్వాహకులను హెచ్చరించారు.

click me!