తెలంగాణలో సినిమా టికెట్ల ధర పెంపు లొల్లి : కోర్టుకెళ్తామంటున్న మంత్రి తలసాని

By Nagaraju penumalaFirst Published May 8, 2019, 2:33 PM IST
Highlights

ఇటీవల కాలంలో సినిమా టికెట్ల ధరల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో టికెట్ల ధరల పెంపుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ వస్తున్న వార్తలు సరికాదన్నారు. 

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సినిమా టికెట్లు ధరల పెంపుదలపై తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చెయ్యలేదని క్లారిటీ ఇచ్చారు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. 

ఇటీవల కాలంలో సినిమా టికెట్ల ధరల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో టికెట్ల ధరల పెంపుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ వస్తున్న వార్తలు సరికాదన్నారు. 

సూపర్ స్టార్ మ‌హేష్ బాబు, వంశీ పైడిప‌ల్లి దర్శకత్వంలో రూపుదిద్దుకుని మే9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది మహర్షి సినిమా. అయితే సినిమాకు సంబంధించి టికెట్లు ఇప్పటికే హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. 

మహర్షి సినిమా రోజుకు ఐదు షోలు వేసుకోవడంతోపాటు, టికెట్ ధరల పెంచుకోవచ్చంటూ తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. 

తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరల పెంపు వ్యవహారంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. 79 సినిమా ధియేర్లు రేట్లు పెంచి టికెట్ లు విక్రయించాయని తమ దృష్టికి వచ్చిందన్నారు. 

ఇకపోతే ప్రభుత్వ అనుమతులతో సింగిల్ స్క్రీన్ ధియేటర్ లో రూ.80 టికెట్ ధర రూ.110లకి పెరిగిందని, అలాగే మల్టిప్లెక్స్ ధియేటర్లలో రూ.138ల టికెట్ ధర రూ.200లకు పెంచినట్లు వస్తున్న వార్తల్లో కూడా వాస్తవం లేదన్నారు. 

ఈ వ్యవహారంపై హోంశాఖ, న్యాయ శాఖ అధికారులతో చర్చించినట్లు తెలిపారు.  ఇంత పెద్దమెుత్తంలో టికెట్ ధరలు పెంచడం వల్ల సామాన్యుడు వినోదానికి దూరమయ్యే అవకాశం ఉందని ఈ పరిణామాల నేపథ్యంలో ధరల పెంపుపై కోర్టుకు వెళ్తామని తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.


 

click me!