వార్నింగ్...ఆ సమయంలో బయటకు రావొద్దు

By telugu teamFirst Published May 8, 2019, 12:05 PM IST
Highlights

తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత రోజు రోజుకీ పెరిగిపోతోంది. పని మీద బయటకు వస్తే చాలు.. వడదెబ్బ తగలి పిట్టల్లా రాలిపోతున్నారు. మరో నాలుగు రోజుల్లో వడగాలులు కూడా రావచ్చని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

ఉదయం 11 నుంచి సాయంత్రం 4వరకు జనాలు బయటకు రావొద్దని సూచిస్తున్నారు. చిన్నారులు, వృద్ధుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. తెలుగురాష్ట్రాల్లో మరింత ఎండలు పెరిగిగాయి. ఎండల ప్రభావంతో వడగాలులు వీస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు మించి నమోదవుతున్నాయి. దీంతో వడదెబ్బ మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది.

వీలైనంత వరకు ప్రజలు నీడపట్టున ఉండాలని.. నీరు శాతం ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టవద్దని హెచ్చరిస్తున్నారు. 

click me!