విజయశాంతిపై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : May 08, 2019, 01:54 PM IST
విజయశాంతిపై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

సారాంశం

తనపై విజయశాంతి చేసిన వ్యాఖ్యలకు ధీటుగా బదులిచ్చారు కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి.

తనపై విజయశాంతి చేసిన వ్యాఖ్యలకు ధీటుగా బదులిచ్చారు కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. తనపై రాములమ్మ చేసిన వ్యాఖ్యలకు స్పందించనని, అయితే ఆమె పార్టీ కోసం గట్టిగా పనిచేస్తే మంచిదని జగ్గారెడ్డి సూచించారు.

విజయశాంతి పీసీసీ పదవి కోరుకుంటున్నట్లుగా ఉన్నారని, కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువని ఆయన స్పష్టం చేశారు. పార్టీలో ఎంతో మందికి సీఎం కావాలనే కోరిక ఉందని.. అయితే అందరినీ కలుపుకొని పనిచేసే నాయకుడు అవసరమని జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు.

పదవులు ఆశించకుండా పనిచేసే వారు పీసీసీ అధ్యక్షుడు అయితే మంచిదని, విజయశాంతి వల్ల పార్టీకి లాభం.. పార్టీ వల్ల విజయశాంతికి లాభమని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఫుల్‌టైం పార్టీ కోసం కష్టపడితే మంచి ఆదరణ ఉంటుందని జగ్గారెడ్డి సూచించారు.

పార్టీ ప్రక్షాళనపై రాహుల్ గాంధీకి లేఖ రాస్తానని ఆయన తెలిపారు. రాహుల్ ఆదేశాల మేరకు తాము పనిచేస్తామన్నారు. 

PREV
click me!

Recommended Stories

Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?
School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే