తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు నోటిఫికేషన్: ఆ బిల్లు ఆమోదానికే....

By Nagaraju penumalaFirst Published Jul 12, 2019, 8:27 PM IST
Highlights

రాష్ట్రంలో నూతన మున్సిపల్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాతే మున్సిపల్ ఎన్నికలను నిర్వహించనున్నట్టు సమాచారం. ఆగస్టు మొదటివారంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు సమాచారం.  మున్సిపల్ బిల్లుకు తుదిరూపం ఇవ్వడానికి ముసాయిదా చట్టాన్ని ఇప్పటికే న్యాయశాఖకు పంపించింది తెలంగాణ ప్రభుత్వం. 

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల 18,19న ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నోటిఫికేషన్ లో స్పష్టం చేసింది. జూలై 18న ఉదయం 11 గంటలకు శాసన సభ సమావేశం ప్రారంభకానుందని తెలిపింది. 

జూలై 19న మధ్యాహ్నాం 2 గంటలకు శాసన మండలి సమావేశం ప్రారంభం కానుంది. అయితే రాష్ట్రంలో నూతన మున్సిపల్ చట్టం ఆమోదం కోసమే ఈ శాసన సభ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.  

ఉభ‌య స‌భ‌ల్లో నూత‌న మున్సిపల్ చట్టంపై చర్చించి ఆమోదం తెల‌ప‌నున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఈనెల 18న కొత్త మున్సిపాలిటీ చట్టం బిల్లు ప్రతులను ఎమ్మెల్యేలకు అందించనున్నారు. బిల్లుపై 19న చర్చించి ఉభయ సభలు ఆమోద ముద్ర వేయనున్నాయి.  

ఇకపోతే అసెంబ్లీ, మండలి సమావేశాలు కేవలం మున్సిపల్ బిల్లును ఆమోదించేందుకు మాత్రమే ఉద్దేశించినవని, ప్రశ్నోత్తరాలు తదితర అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ఉండవని సీఎంవో కార్యాలయం ఇప్ప‌టికే స్పష్టం చేసింది. 

click me!