చెరలో ఉన్న టీఆర్ఎస్ నేతను హత్య చేసిన మావోలు

Published : Jul 12, 2019, 05:50 PM ISTUpdated : Jul 12, 2019, 08:14 PM IST
చెరలో ఉన్న టీఆర్ఎస్ నేతను హత్య చేసిన మావోలు

సారాంశం

 కొత్తూరు మాజీ ఎంపీటీసీ , టీఆర్ఎస్ నేత శ్రీనివాస రావును మావోయిస్టులు హత్య చేశారు. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా ఎర్రంపాడు వద్ద శ్రీనివాసరావు మృతదేహన్ని మావోలు వదిలివెళ్లారు.

కొత్తగూడెం: కొత్తూరు మాజీ ఎంపీటీసీ , టీఆర్ఎస్ నేత శ్రీనివాస రావును మావోయిస్టులు హత్య చేశారు. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా ఎర్రంపాడు వద్ద శ్రీనివాసరావు మృతదేహన్ని మావోలు వదిలివెళ్లారు.

ఈ నెల 8వతేదీన మాజీ ఎంపీటీసీ శ్రీనివాసరావును మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. కొత్తూరు ఎంపీటీసీగా శ్రీనివాసరావు గతంలో పనిచేశాడు.  శ్రీనివాసరావును  కిడ్నాప్ చేసిన తర్వా ఆయన ఆచూకీ కోసం గ్రామస్తులు పోలీసులు వెదికారు.

ఎర్రంపాడు-చెట్టిపాడు గ్రామాల మధ్య శ్రీనివాసరావు మృతదేహాన్ని మావోలు వదిలివెళ్లారు.పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరిస్తున్నాడని  మావోలు  లేఖను వదిలివెళ్లారు. కిడ్నాప్ చేసే సమయంలో కుటుంబసభ్యులు బతిమిలాడారు. మావోలు వారికి తుపాకీ చూపి బెదిరించి  శ్రీనివాసరావును కిడ్నాప్ చేశారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Telangana Rising Global Summit: రూ.5.75 లక్షల కోట్ల భారీ ఒప్పందాలు.. ప్రపంచ దిగ్గజ సంస్థల క్యూ !