మైనారిటీలకు అండ కాంగ్రెస్సే,ఇప్పటికీ ఎప్పటికీ:ఉత్తమ్

By Nagaraju TFirst Published Nov 3, 2018, 1:35 PM IST
Highlights

ముస్లిం మైనారిటీలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో హైదరాబాద్ లో ముస్లిం మతపెద్దలతో ఉత్తమ్ సమావేశమయ్యారు. ముస్లింలకు అన్ని రకాలుగా న్యాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని కోరారు. 
 

హైదరాబాద్: ముస్లిం మైనారిటీలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో హైదరాబాద్ లో ముస్లిం మతపెద్దలతో ఉత్తమ్ సమావేశమయ్యారు. ముస్లింలకు అన్ని రకాలుగా న్యాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని కోరారు. 

కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముస్లిం మైనారిటీల వెంటే ఉంటుందని ఉత్తమ్ గుర్తు చేశారు. వివాదాస్పద అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ముస్లింలకు అన్నిరకాలుగా న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ముస్లిం యువతకు విద్య,ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అదే తమ మెుదటి ప్రాధాన్యతగా తీసుకుంటామని తెలిపారు. 

కాంగ్రెస్ పార్టీ అన్ని మతాలను గౌరవించే పార్టీ అని ఉత్తమ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీని చార్మినార్ కి రప్పించామని తెలిపారు. మోదీ హయాంలో ఏం తింటున్నావ్, ఎవరిని పెళ్లి చేసుకుంటున్నావ్ అనే చర్చ ఎక్కువైందన్నారు. నాలుగున్నరేళ్లలో అటు తెలంగాణ ఇటు దేశంలో ఏం జరిగిందో అందరూ చూశారన్నారు. మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే నష్టమన్న ఉత్తమ్ దేశభవిష్యత్ ప్రమాదంలో ఉందన్నారు. 

నాలుగున్నరేళ్లుగా అటు తెలంగాణ ఇటు దేశంలో మైనారిటీల హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వాలు నేటికి ఎందుకు అమలు చెయ్యడం లేదని ప్రశ్నించారు. ఎన్నికల్లో హామీలు ఇవ్వడం ఆ తర్వాత వాటిని అమలు చెయ్యకపోవడం టీఆర్ఎస్, బీజేపీలకు అలవాటు అని అయితే తమ పార్టీ మాత్రం ఇచ్చిన హామీని అమలు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.   

click me!