శిక్ష పేరుతో దండిస్తే నడవలేని స్థితికి విద్యార్థి...

By Nagaraju TFirst Published Nov 3, 2018, 1:03 PM IST
Highlights

క్రమశిక్షణ పేరుతో ఉపాధ్యాయులు విద్యార్థులకు వేస్తున్న శిక్షలు వివాదాలకు కారణమవుతున్నాయి. కొన్ని చోట్ల ఉపాధ్యాయులు వేస్తున్న దండనలు విద్యార్థుల ప్రాణాలను సైతం బలితీసుకున్నాయి. చిన్న చిన్న కారణాలను భూతద్దంలో చూసి విద్యార్థులపై తమ ప్రతాపం చూపుతూ భయందోళనకు గురి చేస్తున్నారు ఉపాధ్యాయులు. 

హైదరాబాద్: క్రమశిక్షణ పేరుతో ఉపాధ్యాయులు విద్యార్థులకు వేస్తున్న శిక్షలు వివాదాలకు కారణమవుతున్నాయి. కొన్ని చోట్ల ఉపాధ్యాయులు వేస్తున్న దండనలు విద్యార్థుల ప్రాణాలను సైతం బలితీసుకున్నాయి. చిన్న చిన్న కారణాలను భూతద్దంలో చూసి విద్యార్థులపై తమ ప్రతాపం చూపుతూ భయందోళనకు గురి చేస్తున్నారు ఉపాధ్యాయులు. 


తాజాగా హైదరాబాద్ బోడుప్పల్ లోని ఓ ప్రైవేట్ స్కూల్ లో ఓ టీచర్ విద్యార్థికి ఇచ్చిన పనిస్మెంట్ ఆ విద్యార్థిని నడవలేని పరిస్థితికి తీసుకువచ్చింది. ప్రైవేట్ స్కూల్లో ఆరోతరగతి చదువుతున్న విద్యార్థి జ్వరం కారణంగా పాఠశాలకు హాజరుకాలేదు. శనివారం స్కూల్ కిరావడంతో ప్రిన్సిపాల్ ఆగ్రహంతో ఊగిపోయాడు. పాఠశాలకు ఎందుకు రాలేదని నిలదీశారు. 


జ్వరం వచ్చిందని అందువల్లే రాలేదని విద్యార్థి చెప్పాడు. విద్యార్థి జ్వరం వచ్చిందని చెప్పినా వినని ఆ ప్రిన్సిపాల్ దండన విధించారు. 100 గుంజీలు తియ్యాలని ఆదేశించారు. అప్పటికే అనారోగ్యంతో ఉన్న ఆ విద్యార్థి గుంజీలు తీసి మరింత నీరసించిపోయాడు. కనీసం నడవలేని స్థితికి చేరుకున్నాడు. 

సమాచారం అందుకున్న తల్లిదండ్రులు బాలల హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. బాలల హక్కుల సంఘంతో కలిసి మేడిపల్లి పీఎస్ లో ప్రిన్సిపాల్ పై ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం విద్యార్థి ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు.  

ఈ వార్తలు కూడా చదవండి

టీచర్ పాడుబుద్ధి, ప్రేమించలేదని విద్యార్థినిపై కత్తితో దాడి
click me!