చంద్రబాబుపై పోసాని సంచలన కామెంట్స్

Published : Nov 03, 2018, 01:14 PM IST
చంద్రబాబుపై పోసాని సంచలన కామెంట్స్

సారాంశం

జూబ్లీహిల్స్ నియోజకవర్గం టీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ ఈరోజు నటుడు పోసాని కృష్ణ మురళి ఇంటికి వెళ్లి ఆయన మద్దతు కోరారు.

ఏపీ సీఎం చంద్రబాబునాయుడిపై సినీ నటుడు పోసాని కృష్ణ మురళి సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణలో వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు పార్టీ నేతలు తమ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.

దీనిలో భాగంగానే జూబ్లీహిల్స్ నియోజకవర్గం టీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ ఈరోజు నటుడు పోసాని కృష్ణ మురళి ఇంటికి వెళ్లి ఆయన మద్దతు కోరారు. ఈ సందర్భంగా పోసాని మాట్లాడుతూ..‘‘ టీఅర్ఎస్ పార్టీకే నా ఓటేస్తా.. తక్కువ వ్యవధిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన కెసిఆర్ దేశంలోనే ఉత్తమ సీఎం లలో ఒకరు.. హైదరాబాద్ లో ఉంటున్న  ఆంధ్రా వాసులు చంద్రబాబు మాటలను నమ్మొద్దు.. బాబు మాటలు నమ్మి ఓటేస్తే మరో యాబై ఏళ్లు వెనక్కి వెళ్తారు.దేశంలో చంద్రబాబు లాంటి మోసగాడు మరొకరు లేరు. చంద్రబాబు బతికి ఉన్నంత కాలం నిజాలు చెప్పరు. నిజం చెబితే తల వెయ్యి ముక్కలవుతుంది అని చంద్రబాబుకు శాపం ఉంది.’’ అంటూ పోసాని వ్యాఖ్యానించారు. 

PREV
click me!

Recommended Stories

డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!
హైదరాబాద్‌లో 72 అంత‌స్తుల బిల్డింగ్‌.. ఎక్క‌డ రానుందో తెలుసా.? ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్ ఖాయం