ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి: సీఎం కేసీఆర్ కు రేవంత్ బహిరంగ లేఖ

By Nagaraju penumalaFirst Published Sep 6, 2019, 9:03 PM IST
Highlights

తెలంగాణ సీఎం కేసీఆర్ కు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. చరిత్రలో ఏ ఆలయాల్లో పాలకుల చిత్రాలు చెక్కలేదని, యాదాద్రిలో స్తంభాలపై కేసీఆర్ బొమ్మలు చెక్కడం దుర్మార్గమంటూ లేఖలో పేర్కొన్నారు. 
 

హైదరాబాద్: పవిత్ర పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో స్తంభాలపై సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ గుర్తు కారు, చిత్రాలను చెక్కడంపై కాంగ్రెస్ పార్టీ రాద్ధాంతం చేస్తోంది. పవిత్ర పుణ్యక్షేత్రాన్ని రాజకీయాలకు వాడుకుంటారా అంటూ మండిపడుతోంది. 

తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ కు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. చరిత్రలో ఏ ఆలయాల్లో పాలకుల చిత్రాలు చెక్కలేదని, యాదాద్రిలో స్తంభాలపై కేసీఆర్ బొమ్మలు చెక్కడం దుర్మార్గమంటూ లేఖలో పేర్కొన్నారు. 

కేసీఆర్ చర్యలతో హిందువుల మనోభావాల్ని దెబ్బతీశారని, వ్యక్తి పూజ కోసం వ్యవస్థలను నాశనం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. కేసీఆర్ నియంతృత్వానికి ఇది పరాకాష్ట అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ముఖ్యులకు పిచ్చి పరాకాష్టకు చేరిందని, దేవాలయాల్లో రాజకీయాలకు చోటుకల్పించడమేంటని నిలదీశారు. 

దేవాలయాల్లోని స్తంభాలపై కేసీఆర్, కారు చిత్రాలను చెక్కిన ఘటనపై తక్షణమే విచారణ జరిపించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆదేశాలతో జరిగితే ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు ఆందోళన చేస్తామని రేవంత్‌రెడ్డి లేఖలో హెచ్చరించారు.

ఈ వార్తలు కూడా చదవండి

కేసీఆర్ మహారాజునని ఊహించుకుంటున్నారు, దొరతనం ప్రమాదకరం: విజయశాంతి ఫైర్

యాదాద్రి శిల్పాలపై కేసీఆర్ బొమ్మలు

యాదాద్రి ఆలయానికి మహా ద్వారాలు

click me!