వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారో లేదో.. టీ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలనేది తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కల అని, దాని కోసం తాను కృషి చేస్తానని షర్మిల ఈ రోజు అన్నారు. అలా ప్రజలు అనుకోవడం లేదని కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
Kishan Reddy: వైఎస్ షర్మిలా రెడ్డి వైఎస్సార్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఆమె కాంగ్రెస్‌లో చేరారు. మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ ఆమెను కండువా కప్పి హస్తం పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిలా చేసిన వ్యాఖ్యలపైప తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి స్పందించారు. ఆమెకు కౌంటర్ ఇచ్చారు.
కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పోటీ చేయాలని టికెట్ ఇచ్చినా చేస్తానని షర్మిలా చెబుతూ.. తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చూసి ఉంటే సంతోషించేవాడని వివరించారు. తన అడుగుజాడల్లో నడుస్తున్నందుకు సంబురపడేవాడని, రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలనేది తన తండ్రి కలగా ఉండేదని అన్నారు. తాను తన తండ్రి కల సాకారం అవ్వడానికి ప్రయత్నిస్తానని, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే లక్ష్యంగా పని చేస్తానని వివరించారు.
undefined
Also Read: Kodali Nani: కాంగ్రెస్‌లోకి షర్మిల.. కొడాలి నాని సంచలనం.. ‘జగన్‌కు క్షమాపణలు చెప్పాలి’
అయితే, ఈ వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలని ప్రజలు అనుకోవడం లేదని అన్నారు. ‘ప్రజలు అలా అనుకోవడం లేదు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడం షర్మిలనో.. మరెవరో చేయరు. అది సామాన్య ప్రజలు అనుకోవాలి. ఎవరిని ప్రధానమంత్రిని చేయాలనేదే సామాన్య ప్రజలే డిసైడ్ చేస్తారు. కానీ, రాహుల్ గాంధీ ఫార్ముల ఫెయిల్యూర్ అయింది. రాహుల్ గాంధీ మెడిసిన్ ఫెయిల్యూరే. ఆయన ఫార్ముల ప్రాథమికంగానే విఫలమైంది’ అని తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి విలేకరులకు గురువారం తెలిపారు.