రంజాన్‌ మాసంలో గణనీయంగా పెరిగిన బిర్యానీ ఆర్డర్లు.. హైదరాబాద్ లోనే ఎన్ని లక్షల ప్లేట్లు తిన్నారో తెలుసా?

By Rajesh Karampoori  |  First Published Apr 12, 2024, 9:15 AM IST

Biryani: ముస్లిం సోదరుల పవిత్ర మాసం రంజాన్‌ నేపథ్యంలో ప్రముఖ పుడ్ డెలవరీ సంస్థ స్విగ్గీ నివేదిక ఓ ఆశ్చర్యకర నివేదికను వెల్లడించింది. రంజాన్ సందర్భంగా దేశవ్యాప్తంగా సాంప్రదాయ రుచికరమైన వంటకాల కోసం స్విగ్గీపై ఆర్డర్‌లు గణనీయంగా పెరిగాయనీ, అందులో బిర్యానీ ఆర్డర్లలో హైదరాబాద్‌ టాప్‌ లో ఉన్నట్లు స్విగ్గీ తెలిపింది.ఇంతకీ ఎన్ని లక్షల ఫ్లేట్ల బిర్యానీని ఆర్డర్ చేశారో తెలిస్తే షాక్ కావాల్సిందే. 
 


Biryani: బిర్యానీ అంటే ఇష్టపడని వారెవరు ఉండరు. చిన్న పిల్లల నుంచి పెద్ద వారికి వరకు వయసుతో సంబంధం లేకుండా బిర్యానీ  తెగ ఇష్టపడి తింటారు. అందరికీ చాలా ఇష్టం. వద్దు వద్దు అంటూనే మొత్తం లాగించేస్తారు. అందులోనూ హైదరాబాద్ బిర్యానీ అంటే.. నిజంగా  ఆ పేరు వినగానే.. మనసులో అసలు తగ్గేదేలే..  ఓ పట్టు పడాల్సిందే రా అనే ఫిలింగ్ వచ్చేస్తుంది. అంతలా మన మైండ్ లో ఫిక్స్ అయ్యింది. ఈ క్రేజ్ తోనే హైదరాబాద్‌ బిర్యానీనికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. విదేశీ టూరిస్టులు సైతం ఎంతో ఇష్టంగా హైదరాబాద్ బిర్యానీని తిని వెళ్తుంటారు. 

ఇక ముస్లిం సోదరుల పవిత్ర రంజాన్‌ నేపథ్యంలో ప్రముఖ పుడ్ డెలవరీ సంస్థ స్విగ్గీ నివేదిక ఓ ఆశ్చర్యకర నివేదికను వెల్లడించింది. రంజాన్ సందర్భంగా దేశవ్యాప్తంగా సాంప్రదాయ రుచికరమైన వంటకాల కోసం స్విగ్గీపై ఆర్డర్‌లు గణనీయంగా పెరిగాయి. అందులో బిర్యానీలు, హాలీం(Haleem) వంటకాల ఆర్డర్స్ లో ఎక్కువగాఉన్నాయని,  అందులోనూ దేశవ్యాప్తంగా హైదరాబాద్‌ బిర్యానీ(Hyderabad Biryani) టాప్ లో ఫ్లేస్ లో ఉందని వెల్లడించింది.  
 
స్విగ్గీ నివేదిక ప్రకారం.. (మార్చి 12 నుండి ఏప్రిల్ 8, 2024 వరకు) భారతదేశంలో రంజాన్ 2024 సందర్భంగా Swiggy ప్లాట్‌ఫారమ్ ద్వారా సుమారు 6 మిలియన్ల బిర్యానీ ప్లేట్లు ఆర్డర్ వచ్చాయట. సాధారణ నెలలతో పోలిస్తే..  ఇది 15% ఎక్కవ. ఇక  బిర్యానీని అత్యధికంగా హైదరాబాద్ లో ఆర్డర్ చేశారు. ఆ లెక్కలను చూస్తే.. కచ్చితంగా మీరు  ఆశ్చర్యపోవాల్సిందే.. హైదరాబాద్లోనే  ఏకంగా మిలియన్ (10 లక్షలు) ప్లేట్ల బిర్యానీ, 5.3 లక్షల ప్లేట్ల హలీమ్ ఆర్డర్ చేశారంట. 

Latest Videos

అందులోనూ Swiggyలో 5:30 నుంచి  7 pm మధ్య ఆర్డర్‌ల సంఖ్య  34% పెరిగిందనీ,  దేశవ్యాప్తంగా ఈ సమయంలో చికెన్ బిర్యానీ, మటన్ హలీమ్, సమోసా, ఫలూదా మరియు ఖీర్ వంటి ఆహార పదార్థాలు ఎక్కువగా ఆర్డర్ చేసినట్టు స్విగ్గీ వెల్లడించింది.  స్విగ్గీ నివేదిక ప్రకారం.. హలీం 1455%, ఫిర్ని 81%, మాల్పువా 79%  అమ్మకాలు పెరిగినట్టు తెలిపింది. ముంబై, హైదరాబాద్, కోల్‌కతా, లక్నో, భోపాల్, మీరట్‌లలో ఇఫ్తార్ స్వీట్ డిష్‌ల ఆర్డర్‌లు గణనీయంగా పెరిగాయి. 

click me!