సెల్‌ఫోన్‌కు అసభ్య మేసేజ్‌లు: ట్విస్టిచ్చిన యువతి,కానీ...

Published : Sep 30, 2018, 04:00 PM IST
సెల్‌ఫోన్‌కు అసభ్య మేసేజ్‌లు: ట్విస్టిచ్చిన యువతి,కానీ...

సారాంశం

ఓ యువతి సెల్‌ఫోన్‌కు అసభ్య సందేశాలు  పంపి ఆ యువతి మరణానికి  పరోక్షంగా ఆ యువకుడు కారణమయ్యాడు.


హైదరాబాద్: ఓ యువతి సెల్‌ఫోన్‌కు అసభ్య సందేశాలు  పంపి ఆ యువతి మరణానికి  పరోక్షంగా ఆ యువకుడు కారణమయ్యాడు. ఈ ఘటన పటాన్‌చెరు రామచంద్రాపురంలో చోటు చేసుకొంది.

మెదక్ జిల్లా పటాన్‌చెరువు రామచంద్రాపురంలో రమేష్, అనిత  దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి శ్వేత, నవీన్ సంతానం. శ్వేత చింతల్‌లోని వనిత డిగ్రీ కాలేజీలో బీకాం చదువుతోంది.

దూలపల్లిలో రమేష్  కుటుంబససభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. శ్వేత మొబైల్‌కు  సాయితేజ అనే యువకుడు అసభ్య మేసేజ్‌లు పంపుతున్నాడు. దీంతో ఈ మేసేజ్‌ల నుండి తాను తప్పించుకొనేందుకు గాను ఆ యువతి ఓ ప్లాన్ చేసింది.

తన పోన్ పోయిందని చెప్పి ఆ ఫోన్ ను వరుసకు బావయ్యే శ్రీకాంత్ కు ఇచ్చింది.  అయితే  సాయితేజ మాత్రం ఆ ఫోన్ కు అసభ్యకర మేసేజ్ లు పంపతున్నాడు.ఈ విషయాన్ని గమనించిన శ్రీకాంత్ సాయితేజను పిలిపించి దాడిచేశాడు.

దీంతో సాయి తేజ దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.  ఈ విషయమై పెద్ద మనుషుల మధ్య ఒప్పందం జరిగింది.ఈ కేసు విషయమై ఇరు వర్గాలు రాజీ పడ్డారు. శ్రీకాంత్ .. సాయితేజకు  రూ. 10వేలు ఇచ్చాడు.

అయితే బావకు  అన్యాయంగా పెద్ద మనుషులు  రూ. 10వేలు జరిమానాను విధించారని మనస్తాపానికి గురైన శ్వేత  శనివారం రాత్రి ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. శ్వేత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 


.

PREV
click me!

Recommended Stories

Weather Update: మరో 4 రోజులు దంచికొట్టనున్న వానలు.. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంతో ఆరెంజ్ అలెర్ట్
నేషనల్ మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రెస్ మీట్ | Telangana CM Revanth Reddy Pressmeet