
తెలంగాణ పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న స్టయిఫెండరీ కానిస్టేబుళ్ల పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 17,156 ఉద్యోగాల కోసం 4.5 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
దీనిలో భాగంగా ఇవాళ రాతపరీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 966 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు.
మరోవైపు వరంగల్‌లోని పరీక్షా కేంద్రాలను నగర పోలీస్ కమిషనర్ డా. రవీందర్ పరిశీలించారు. సుదూర ప్రాంతాల నుంచి పరీక్షా కేంద్రాల వద్ద కు వచ్చే వారి కోసం హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేయడం వల్ల అభ్యర్థులకు ఉపయోగపడిందని ఆయన తెలిపారు. ప్రత్యేకంగా బస్సులు, ఆటోలు ఏర్పాటు చేసి సమయానికి వారిని పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారని కమిషనర్ వెల్లడించారు.