
తెలంగాణ సిఎం కెసిఆర్ పై వరాల జల్లులు కురిపించారు స్వర్ణలత. కెసిఆర్ ను కోట్లకు పడగలెత్తిస్తానని హామీ ఇచ్చారు. కెసిఆర్ ఆయురోగ్యాలతో వర్ధిల్లుతాడని భరోసా ఇచ్చారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాలి బోనాల సందర్భంగా రంగం చెప్పారు స్వర్ణలత. ఆమె తన భవిష్యవాణిలో ప్రత్యేకంగా సిఎం కెసిఆర్ ఆరోగ్య పరిస్థితిని ప్రస్తావించారు. సుఖశాంతులతో కేసీఆర్ వర్ధిల్లుతాడు. ఆయనకు ఎలాంటి ఆపద రాదు. కెసిఆర్ కోట్లకు పరిడిగెత్తేలా చేయడం నా బాధ్యత అంటూ తన భవిష్యవాని వినిపించారు స్వర్ణలత.
సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. పాడిపంటలతో రాష్ట్రం విరాజిల్లుతుందన్నారు. ప్రజలు సుఖశాంతులతో ఉంటారని జోస్యం చెప్పారు స్వర్ణలత. తనకు సేవ చేసినా చేయకపోయినా భక్తులంతా తన బిడ్డలేనని పేర్కొన్నారు. ప్రజలందరూ సుఖశాంతులతో ఉండేలా చూస్తానన్నారు. భక్తులకు ఎలాంటి ఆపదలు రానివ్వనని స్పష్టం చేశారు స్వర్ణలత.
ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరలో కీలక ఘట్టమైన 'రంగం' వైభవంగా జరిగింది. పచ్చి కుండపై నిలబడిన స్వర్ణలత అమ్మవారిని తనలోకి ఆవాహన చేసుకుని భవిష్యవాణిని వినిపించింది. తాను సంతోషంగానే ఉన్నానని, తనకు జరుగుతున్న పూజలు ఆనందాన్ని కలిగిస్తున్నాయని అమ్మ పలికింది. తన ప్రజలందరూ సుఖశాంతులతో వర్థిల్లేలా చూస్తానని, ఎటువంటి ఆపదా రానివ్వకుండా చూసుకుంటానని వరమిచ్చింది.