జేసీ దివాకర్ రెడ్డికి దిమ్మ తిరిగే షాక్

First Published Jul 9, 2017, 11:59 AM IST
Highlights

విశాఖ విమానాశ్రయంలో విమానయాన శాఖ సిబ్బందిపై చిందులేసిన టిడిపి ఎంపి జెసి దివాకర్ రెడ్డికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ అధికారులు. వాళ్ల దెబ్బతో జెసి విమానం ఎక్కకుండానే వెనుదిగాల్సి వచ్చింది. రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ఏం చేసినా చెల్లుతుందనుకునే వారికి ఈ పరిణామం కొంచెం చేదుగానే ఉంటదని రుజువు చేశారు ఎయిర్ పోర్ట్ సిబ్బంది.

తెలుగుదేశం పార్టీ అనంతపురం పార్లమెంట్ సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డికి ఇయ్యాల ఉదయం శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో చుక్కెదురైంది. విజయవాడకు వెళ్లేందుకు ఆయన శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చారు. ఈ ఉదయం 6:40 గంటలకు విజయవాడ వెళ్లే ట్రూ జెట్ విమానంలో ప్రయాణించేందుకు ఆయన టికెట్ బుక్ చేసుకున్నారు. అయితే  "మీపై నిషేధం ఉన్న కారణంగా అనుమతించలేము" అని ట్రూ జెట్ సిబ్బంది జెసికి స్పష్టం చేశారు.

దీంతో చేసేదేమీ లేక జేసీ విమానాశ్రయం నుంచి వెనుదిరిగారు. ఇటీవల విశాఖపట్నంలో ఆయన విమానాశ్రయ సిబ్బందిపై అనుచితంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో జేసీపై పలు విమానయాన సంస్థలు నిషేధాన్ని అమలు చేస్తున్నాయి. ఆ రోజు విమానయాన మంత్రి అశోక్ గజపతిరాజు చొరవతో విమానం ఎక్కినా, ఆ తరువాత జేసీ విమానాశ్రయానికి వెళ్లి విమానం ఎక్కలేకపోవడం ఇదే తొలిసారి. రానున్న రోజుల్లో ఇక జెసి విమానంలో ప్రయాణించడం కస్టమేమో మరి?

click me!