
హైదరాబాద్ : రాష్ట్ర మంత్రి Srinivas Goud హత్య కోణంలో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఎంతోకాలంగా ప్రతీకారంతో రగిలిపోతున్న వ్యక్తే ఆయనను అంతమొందించేందుకు, సుపారీ ముఠాతో కలిసి పథక రచన చేసినట్లుగా బయటపడుతుంది. మంత్రి murderకు ప్రధాన సూత్రధారి Raghavendra Rajuను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయిదేళ్లుగా తనను financialగా దెబ్బ తీసేందుకు సహకరిస్తున్న మంత్రిని అంతం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు పోలీసుల విచారణలో అంగీకరించాడు. ఇదే విషయాన్ని పోలీసులు న్యాయస్థానానికి సమర్పించిన Remand reportలో పొందుపరిచినట్లు తెలుస్తోంది.
రిమాండ్ రిపోర్ట్ లో ఏముందంటే…
మహబూబ్ నగర్కు చెందిన రాఘవేందర్ రాజు 2017 ఆధార్ కార్డు ల తయారీ, పునరుద్ధరణకు అనుమతులు పొందారు. ఆధార్ నమోదుకు సహాయ కేంద్రాన్ని ప్రారంభించారు. వ్యాపారం సజావుగా సాగినా… అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న శ్రీనివాస్ గౌడ్ సోదరుడి నుంచి ఒత్తిడి మొదలయ్యింది. స్థానిక తహసిల్దార్ కార్యాలయం నుంచి సహకారం కరువైంది. దీంతో నష్టపోయిన రాఘవేందర్ రాజు బార్ ప్రారంభించాడు. దీనికి కూడా మంత్రి అనుచరుడు మహమ్మద్ ఫరూక్ అనేక ఆటంకాలు కలిగించడంతో మూతపడింది. ఈ మొత్తం వ్యవహారంలో రాఘవేంద్రరాజు రూ. ఆరు కోట్లు నష్టపోవడంతో కక్ష పెంచుకున్నాడు. ఇది క్రమంగా వివాదాలకు దారి తీశాయి. పరస్పరం కేసులు పెట్టుకున్నారు.
ఈ నేపథ్యంలోనే మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను హత్య చేసేందుకు రాఘవేంద్ర రాజు కుట్రపన్నాడు. అమరేంద్ర రాజుతో కలిసి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. నాగరాజు, యాదయ్య, విశ్వనాథ్ లతో మాట్లాడి సహకరించాలని కోరాడు. ముగ్గురూ కలిసి హత్య చేసినా, సుపారీ ముఠాలతో చేయించిన రూ. 15 కోట్లు ఇస్తామంటూ ఆఫర్ ఇచ్చాడు. ఇదే విషయాన్ని నాగరాజు నిరుడు డిసెంబర్ 18న మహబూబ్ నగర్ ఎక్సైజ్ న్యాయస్థానానికి హాజరైన మహమ్మద్ ఫరూక్ తో చర్చించాడు.
ఫరూక్ తన స్నేహితుడు హైదర్ అలీకి చెప్పాడు. దీంతో మంత్రికుట్ర కోణం బట్టబయలు అవుతుందనే ఉద్దేశంతో నాగరాజు, యాదయ్య, విశ్వనాథ్ భయపడ్డారు. ఫరూక్, హైదర్అలీని హత్య చేసేందుకు సిద్ధమయ్యారు. కొంపల్లి సుచిత్ర వద్ద టీ తాగేందదుకు వారు రాగా మారణాయుధాలతో వెంటపడ్డారు. తప్పించుకున్న బాధితులు పేట్ బషీర్ బాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి అదే రోజు సాయంత్రం ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.
వారిని విచారించిన పోలీసులు మంత్రి హత్యకు కుట్ర చేసిన విషయాన్ని గుర్తించారు. సాంకేతిక ఆధారాలతో ఢిల్లీలో ఐదుగురిని అరెస్టు చేశారు. ఈ కేసులో ఎనిమిది మంది నిందితులను కస్టడీకి తీసుకునేందుకు మల్కాజిగిరి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం శుక్రవారం విచారణ జరపనుంది. ఢిల్లీలో అరెస్ట్ అయిన మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కార్ డ్రైవర్ తిలక్ థాపా గురువారం సొంత పూచీకత్తుమీద విడుదలయ్యారు.
జవాబు లేని ప్రశ్నలెన్నో…
ఫరూక్, నాగరాజు మహబూబ్ నగర్ ఎక్సైజ్ న్యాయస్థానం వద్ద డిసెంబర్ 18న కలిసినట్టు రిమాండ్ నివేదికలో పేర్కొన్నారు. ఆ రోజు శనివారం న్యాయస్థానానికి సెలవు ఉంటుంది అని మీడియా ప్రశ్నించగా, పోలీసు అధికారులు తొలుత నీళ్లు నమిలారు. పొరపాటుగా డిసెంబర్ 18 అంటూ వచ్చిందని అది నవంబర్ 18 అంటూ వివరణ ఇచ్చారు.
మంత్రిని చంపేందుకు పదిహేను కోట్ల నగదు ఎవరు సర్దుబాటు చేస్తారనే ప్రశ్నకు సమాధానం కరువైంది.
నిందితులు తల దాచుకున్న లాడ్జి సీసీ ఫుటేజీ సేకరించారా? అని అడిగితే మౌనం దాల్చారు.
నిందితులు వెంటపడితే బాధితులు పరారైనట్లు చెబుతున్న అంశాలకూ పొంతన కుదరట్లేదు. వీటన్నింటికీ నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారణ జరిగితే సమాధానాలు దొరుకుతాయి అని పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.