సూర్యాపేటలో సరోగసి మాఫియా గుట్టు రట్టు: మహిళలకు డబ్బుతో వల

By narsimha lodeFirst Published Aug 30, 2019, 7:45 AM IST
Highlights

సూర్యాపేట జిల్లాలో సరోగసి మాఫియా రెచ్చిపోయింది. నిరుపేదలే లక్ష్యంగా డబ్బు ఆశ చూపి మహిళలను ట్రాప్ చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు

సూర్యాపేట జిల్లాలో సరోగసి మాఫియా రెచ్చిపోయింది. నిరుపేదలే లక్ష్యంగా డబ్బు ఆశ చూపి మహిళలను ట్రాప్ చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు.

వివరాల్లోకి వెళితే.. జిల్లాకు చెందిన శ్రీలత, రాజు దంపతుల మధ్య గత కొద్దిరోజులుగా మనస్పర్థలు రావడంతో ఇద్దరు విడివిడిగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు మహిళా ఏజెంట్లు శ్రీలతను సరోగసికి ఒప్పించారు. ఇందుకోసం ఆమెను చెన్నైకి పంపించారు.

అయితే నెల రోజులుగా తన భార్య కనిపించడం లేదంటూ రాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఆమె చెన్నైలో ఉన్నట్లు గుర్తించి సూర్యాపేటకు తీసుకొచ్చారు.

పోలీసుల విచారణలో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు ఏజెంట్లు తనను బలవంతంగా సరోగసికి ఒప్పించారని... మాయమాటలు చెప్పి చెన్నై తీసుకెళ్లారని శ్రీలత చెప్పింది.

అంతకాకుండా భర్తతో గొడవపడి.. అతనితో దూరంగా ఉండాలని కూడా ఏజెంట్లు తనతో చెప్పారని చెప్పింది. అయితే సరోగసి ఏజెంట్లు మాత్రం శ్రీలత ఇష్టంతోనే అద్దె గర్భానికి ఒప్పుకుందని.. ఇందుకు రూ.3 లక్షల డీల్ కూడా కుదిరిందని చెప్పారు.  

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా ఇటువంటి మాఫియా బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు.  

click me!