telangana mro : తహసీల్దార్ విజయా రెడ్డి సజీవ దహనం.. నిందితుడు సురేష్‌

By narsimha lodeFirst Published Nov 4, 2019, 3:34 PM IST
Highlights

అబ్దుల్లాపూర్‌మెట్టు ఎమ్మార్వో (తహసీల్దార్)పై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తిని సురేష్‌గా గుర్తించారు.ఈ ఘటనలో సురేష్‌ కూడ తీవ్రంగా గాయపడ్డాడు.

హైదరాబాద్: అబ్దుల్లాపూర్‌మెట్టు ఎమ్మార్వో (తహసీల్దార్)పై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తిని సురేష్‌గా గుర్తించారు.ఈ ఘటనలో సురేష్‌ కూడ తీవ్రంగా గాయపడ్డాడు. నిందితుడు సురేష్‌ను  పోలీసులు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు.

సోమవారం నాడు మధ్యాహ్నం ఎమ్మార్వో విజయారెడ్డితో మాట్లాడాలని  చెప్పి సురేష్ అనే వ్యక్తి పట్టాదారు పాస్‌పుస్తకాలతో ఎమ్మార్వో చాంబర్లోకి వెళ్లాడు.మధ్యాహ్నం ఒకటిన్నర గంటల సమయంలో  సురేష్ అనే వ్యక్తి ఎమ్మార్వో కార్యాలయంలోనే విజయారెడ్డిపై పెట్రోల్‌ పోశాడు. ఆమె చాంబర్‌లోకి వెళ్లిన తర్వాత సురేష్ ఆమె చాంబర్‌ లాక్ చేశాడు.

Also Read:తహశీల్దార్ విజయారెడ్డి సజీవదహనం: విచారణకు ఆదేశించిన ప్రభుత్వం

ఎమ్మార్వో చాంబర్ లాక్ కావడంతో ఎమ్మార్వో చాంబర్ తలుపును డ్రైవర్, అటెండర్ చాంబర్ తలుపులు పగులగొట్టారు. చాంబర్ తలుపులు పగులగొట్టిన తర్వాత హల్‌లోకి వచ్చిన తర్వాత సురేష్ తహసీల్దార్ విజయారెడ్డిపై నిప్పంటించాడు.

Also Read:తహిసీల్దార్ విజయారెడ్డి హత్య.. ఎమ్మార్వోపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టిన దుండగుడు

నిందితుడు సురేష్ అక్కడి నుండి పోలీస్ స్టేషన్‌కు వెళ్తూ కింపడిపోయాడు. నిందితుడు సురేష్‌ను హయత్‌నగర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.నిందితుడు సురేష్ ఎమ్మార్వో విజయారెడ్డి చాంబర్ లోకి వెళ్లి  పెట్రోల్ పోసే సమయంలో ఆమె గట్టిగా కేకలు వేసింది. విజయారెడ్డిపై పెట్రోల్‌పోసే సమయంలో  నిందితుడు సురేష్ పై కూడ పెట్రోల్ పడింది.

సురేష్  ఎమ్మార్వో పై నిప్పు పెట్టిన సమయంలో సురేష్ కూడ గాయపడ్డారు. సురేష్ తన షర్ట్ విప్పి ఎమ్మార్వో  ఆఫీసు నుండి వెళ్లిపోయాడు. గౌరెల్లి ప్రాంతానికి చెందినవాడుగా సురేష్ ను పోలీసులు గుర్తించారు. 

సురేష్ ఎమ్మార్వో కార్యాలయం నుండి నడుచుకొంటూ పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లాడు. అక్కడే నిందితుడు కిందపడిపోయాడు. సురేష్ ను పోలీసులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భూ వివాదమే తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహనానికి కారణంగా భావిస్తున్నారు. 

మరోవైపు అబ్దుల్లాపూర్ మెట్టు వద్ద 65 నెంబర్ జాతీయ రహదారికి ఇరువైపులా రెవిన్యూ ఉద్యోగులు బైఠాయించారు. తహసీల్దార్ విజయారెడ్డిని హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. 

ఎమ్మార్వో విజయారెడ్డిని ఆమె చాంబర్లోనే పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మంటల్లో కాలిపోతూ విజయారెడ్డి హల్‌లోకి వచ్చింది . అక్కడే ఆమె కుప్పకూలింది. మంటల్లో ఉన్న విజయారెడ్డిిని కాపాడేందుకు అటెండర్, డ్రైవర్ ప్రయత్నించారు.ఈ మంటల్లో వీరిద్దరికి కూడ తీవ్ర గాయాలయ్యాయి.నిందితుడు సురేష్ ను ఈ ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ చేయనున్నారు. నిందితుడు సురేష్ కు కూడ తీవ్ర గాయాలైనట్టుగా పోలీసులు చెబుతున్నారు. 

click me!