హైద్రాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు: వాణీదేవి ముందంజ

By narsimha lodeFirst Published Mar 19, 2021, 10:30 AM IST
Highlights

హైదరాబాద్‌-రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా సాగుతోంది.హైదరాబాద్‌ స్థానంలో ఇప్పటివరకు పూర్తైన ఆరు రౌండ్లలో తెరాస, భాజపా మధ్య పోటీ ఉత్కంఠ పోరు సాగుతోంది


హైదరాబాద్‌: హైదరాబాద్‌-రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా సాగుతోంది.హైదరాబాద్‌ స్థానంలో ఇప్పటివరకు పూర్తైన ఆరు రౌండ్లలో తెరాస, భాజపా మధ్య పోటీ ఉత్కంఠ పోరు సాగుతోంది. ఆరో రౌండ్‌ ముగిసే సరికి తెరాస అభ్యర్థి వాణీదేవి సమీప భాజప అభ్యర్థి రామచందర్‌రావుపై 7,626 ఓట్ల ఆధిక్యంతో ముందంజలో ఉన్నారు. 

మొత్తం ఆరు రౌండ్లలో సురభి వాణీదేవికి 1,05,710 ఓట్లు, భాజపా అభ్యర్థి రామచందర్‌రావుకు 98,084, స్వతంత్ర అభ్యర్థి  ప్రొ.నాగేశ్వర్‌కు 50,450, కాంగ్రెస్‌ అభ్యర్థి చిన్నారెడ్డికి 29,627, తెదేపా అభ్యర్థి ఎల్‌.రమణకు 5,606  ఓట్లు పోలయ్యాయి.

ఈ పరిస్థితుల్లో మెజారిటీ ఎవరికీ వచ్చే అవకాశం ఉందో చెప్పే పరిస్థితులు లేవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు తప్పనిసరి అని అధికారులు భావిస్తున్నారు.

అవసరమైతే  మూడో ప్రాధాన్యత ఓట్లని కూడా లెక్కించే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. దీంతో శనివారం రాత్రికి తుది ఫలితాలు వెలువడవచ్చని అంచనా వేస్తున్నారు.
 

click me!