వరంగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి...

Published : Mar 19, 2021, 09:26 AM ISTUpdated : Mar 19, 2021, 10:12 AM IST
వరంగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి...

సారాంశం

వరంగల్ జిల్లాలోని ఆత్మకూరు మండలం నీరుకుళ్ల గ్రామం శివారులో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ఆటోను  తుఫాను వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మహిళా కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. 

గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద ధాటికి గాయపడినవారి శరీర భాగాలు తెగిపడ్డాయి. ఆటో పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. 

కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ములుగు నుంచి వరంగల్ వైపు వస్తున్న తుఫాను వాహనం ఆటోను ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

iBomma Ravi : అసలు ఐబొమ్మ నాది అని చెప్పింది ఎవడు..? ఫస్ట్ టైమ్ నోరువిప్పిన రవి !
Bandi Sanjay About Akhanda 2: బాలకృష్ణలో సీనియర్ ఎన్టీఆర్ ని చూసా: బండి సంజయ్ | Asianet News Telugu