తమిళిసైపై కేసీఆర్ సర్కార్ పిటిషన్: హోలీ సెలవుల తర్వాత విచారించనున్న సుప్రీం

By narsimha lode  |  First Published Mar 3, 2023, 2:57 PM IST


గవర్నర్ తమిళిసైపై  తెలంగాణ ప్రభుత్వం దాఖలు  చేసిన  పిటిషన్ పై  హోలి సెలవుల తర్వాత విచారణ  నిర్వహించే అవకాశం ఉంది. 
 



హైదరాబాద్:  పెండింగ్  బిల్లులపై  కేసీఆర్ సర్కార్  దాఖలు  చేసిన పిటిషన్ పై   హోలి సెలవుల తర్వాత విచారణ  నిర్వహించనుంది  సుప్రీంకోర్టు. తెలంగాణ గవర్నర్  తమిళిసై సౌందరరాజన్ పై   తెలంగాణ ప్రభుత్వం  సుప్రీంకోర్టులో  నిన్న పిటిషన్ దాఖలు చేసింది. 10 బిల్లులు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ వద్ద పెండింగ్ లో  ఉన్నట్టుగా  కేసీఆర్ సర్కార్ చెబుతుంది. 

ఈ బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా  తన వద్ద పెండింగ్ లో పెట్టుకోవడంపై  కేసీఆర్ సర్కార్  తీవ్ర అసంతృప్తితో  ఉంది. దీంతో  సుప్రీంకోర్టులో  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతికుమారి   రిట్  పిటిషన్ దాఖలు  చేశారు. ఈ రిట్ పిటిషన్  ఇవాళ సుప్రీంకోర్టులో  లిస్ట్  కాలేదు. రేపటి నుండి  సుప్రీంకోర్టుకు  హోలి పండుగ సెలవులు.  దీంతో  హౌలి పండుగ సెలవుల తర్వాత  ఈ పిటిషన్ పై  సుప్రీంకోర్టు విచారణ  నిర్వహించే  అవకాశం ఉంది.  

Latest Videos

రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య   సయోధ్య కుదిరిందని  భావించారు.  తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను  గత నెల  3వ తేదీన  గవర్నర్ తమిళిసై  ప్రారంభించడంతో   ఇబ్బందులు తొలగినట్టేనని భావించారు. కానీ  పెండింగ్ బిల్లుల అంశం  తెరమీదికి రావడంతో  రాజ్ భవన్,  ప్రగతి భవన్ మధ్య  గ్యాప్ పై  మరోసారి  చర్చ తెరమీదికి వచ్చింది.

also read:ఢిల్లీ కంటే రాజ్ భవనే దగ్గర: సీఎస్‌పై తమిళిసై ఫైర్

పెండింగ్  బిల్లుల అంశానికి  సంబంధించి  తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు వెళ్లడంపై  గవర్నర్ తమిళిసై  సౌందరరాజన్  సీరియస్ గానే స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారిపై   గవర్నర్  సీరియస్ అయ్యారు. ట్విట్టర్ వేదికగా  గవర్నర్  శాంతికుమారిపై  సీరియస్ వ్యాఖ్యలు  చేశారు. ఢిల్లీ కంటే  రాజ్ భవన్ చాలా దగ్గర అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కారమౌతాయన్నారు. కానీ చర్చల ద్వారా సమస్యల పరిష్కారం  ఇష్టం లేనట్టుందని సీఎస్ శాంతికుమారిపై  తమిళిసై వ్యాఖ్యలు  చేశారు. 
 

click me!