మేడ్చల్ జిల్లా దూలపల్లిలో హరీష్ అనే యువకుడి హత్యకలకలం చోటు చేసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్న హరీష్ ను యువతి బంధువులు హత్య చేశారు.
హైదరారాబాద్: మేడ్చల్ జిల్లా దూలపల్లిలో హరీష్ అనే యువకుడిని హత్య చేసిన ఘటనలో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.హరీష్ వివాహం చేసుకున్న యువతి బంధువులే ఈ హత్య చేశారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన హరీష్ , యువతి కొంతకాలంగా ప్రేమించకుంటున్నారు. ఇటీవలనే వారిద్దరూ వివాహం చేసుకున్నారని చెబుతున్నారు. యువతి కన్పించకుండా పోవడంతో హరీష్ బంధువులకు యువతి సోదరుడు ఫోన్ చేశాడు. యువతిని అప్పగించాలని వార్నింగ్ ఇచ్చాడు.
హరీష్ ను చంపేస్తామని యువతి సోదరుడు తనకు ఫోన్ చేసి బెదిరించాడని హరీష్ బావ మీడియాకు చెప్పారు. హరీష్ యువతిని తీసుకెళ్లిన విషయం కూడ తమకు తెలియదన్నారు. ఈ విషయమై తాము కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా హరీష్ బావ చెప్పారు.
also read:హైద్రాబాద్ దూలపల్లిలో పరువు హత్య: ప్రేమ పెళ్లి చేసుకున్న యువకుడి హత్య
హరీష్ ఎక్కడ ఉన్నాడో గుర్తించి యువతి బంధువులు హత్య చేశారని హరీష్ బావ మీడియాకు చెప్పారు. హరీష్ హత్యకు గురైన పోలీసుల నుండి తమకు ఈ విషయమై సమాచారం అందిందని ఆయన చెప్పారు. హరీష్ ను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని బంధువులు కోరుతున్నారు.