మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డికి సుప్రీం షాక్: హైకోర్టు నిర్ణయానికి సమర్థన

By narsimha lodeFirst Published Jan 7, 2020, 11:16 AM IST
Highlights

తెలంగాణకు చెందిన మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డిపై హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్ధించింది.

హైదరాబాద్: మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డిపై విధించిన అనర్హతను సుప్రీంకోర్టు మంగళవారం నాడు  సమర్ధించింది.  గతంలో భూపతిరెడ్డిపై అనర్హత వేటును తెలంగాణ హైకోర్టు సమర్ధించింది. అయితే  ఈ అనర్హతను సవాల్ చేస్తూ భూపతి రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో కూడ భూపతిరెడ్డికి షాక్ తగిలింది.

Also read:ఆ ముగ్గురు ఎమ్మెల్సీలపై వేటు: ప్రకటించిన శాసన మండలి

హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్ధించింది. 2019 జనవరి 16వ తేదీన  టీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన ముగ్గురు ఎమ్మెల్సీలపై శాసన మండలి ఛైర్మన్ చర్యలు తీసుకున్నారు. ఎమ్మెల్సీలు రాములు నాయక్, భూపతి రెడ్డి, యాదవ రెడ్డిలను అనర్హులుగా ప్రకటిస్తూ శాసన మండలి బులెటిన్ విడుదల చేసింది.

Also read:వేటు: స్వామిగౌడ్ పై మండిపడిన భూపతి రెడ్డి

పార్టీ ఫిరాయింపులకు పాల్పడినందుకు వీరిపై చర్యలు తీసుకున్నట్లు శాసన మండలి కార్యాలయం ప్రకటించింది. పార్టీని వీడి క్లిష్టమైన ఎన్నికల సమయంలో దెబ్బతీయడానికి ప్రయత్నించిన ఎమ్మెల్సీలను ఎంత తొందరగా అయితే అంత తొందరగా పదవీచ్యుతులను చేయాలని టీఆర్ఎస్ అదినాయకత్వం భావిచింది. అందుకోసం మండలి ఛైర్మన్ స్వామిగైడ్ కు ఫిర్యాదు చేసి తొందరగా వారి సభ్యత్వాలను రద్దు చేయాలని టిఆర్ఎస్ కోరింది. దీనిపై మండలి ఛైర్మన్ కూడా తొందరగానే చర్యలు ప్రారంభించారు. 

అయితే ఎమ్మెల్సీలను తొలగించే విషయంలో ఎలాంటి ఎలాంటి న్యాయపరమైన చిక్కులు చేకుండా పద్దతిప్రకారం  చేయాలని ఛైర్మన్ స్వామిగౌ భావించారు. అందుకోసం మొదట ఎమ్మెల్సీలకు నోటిసులు పంపించారు. పార్టీ ఫిరాయింపుపై లిఖిత పూర్వకంగా వివరణ ఇవ్వాలని ఛైర్మన్ కోరారు.  వారు ఇచ్చిన వివరణ ఆధారంగా ఛైర్మన్ విచారణ జరుపారు. 

వీరి విచారణ ప్రక్రియ ముగియడంతో తాజాగా శాసన మండలి ఛైర్మన్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. ముగ్గురు ఎమ్మెల్సీలు రాములు నాయక్, భూపతి రెడ్డి, యాదవ రెడ్డిలను సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.  

దీంతో ఎమ్మెల్సీలు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కూడ భూపతి రెడ్డిపై అనర్హత వేయడాన్ని సమర్ధించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో భూపతిరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేసిన సుప్రీంకోర్టు హైకోర్టు వాదనను సమర్ధించింది.
 

click me!