సచివాలయం కూల్చివేత: సుప్రీంలో కేసీఆర్ కు ఊరట, జీవన్ రెడ్డికి చుక్కెదురు

By narsimha lodeFirst Published Jul 17, 2020, 11:47 AM IST
Highlights

తెలంగాణ సచివాలయం కూల్చివేతపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
 

తెలంగాణ సచివాలయం కూల్చివేతపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.ఈ నెల 11వ తేదీన తెలంగాణ సచివాలయం కూల్చివేతను నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ జీవన్ రెడ్డి సుప్రీంకోర్టులో పిిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై శుక్రవారం నాడు సుప్రీంకోర్టు విచారణ చేసింది. జీవన్ రెడ్డి పిటిషన్ ను కొట్టివేసింది.

గత నెల 29వ తేదీన తెలంగాణ సచివాలయం కూల్చివేతపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని జీవన్ రెడ్డి తన పిటిషన్ లో  సుప్రీంకోర్టును కోరారు.తెలంగాణ సచివాలయం నిర్మాణం ప్రభుత్వ విధానమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ పిటిషన్ పై తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 

also read:తెలంగాణ సచివాలయం కూల్చివేత పనులకు బ్రేక్: రేపటి వరకు స్టే పొడిగించిన హైకోర్టు


తెలంగాణ సచివాలయం కూల్చివేతకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ జూన్ 29వ తేదీన హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే సచివాలయం కూల్చి వేత పనులను కోవిడ్ నిబంధనలతో పాటు, పర్యావరణ నిబంధనలను పాటించడం లేదని ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు, చిక్కుడు ప్రభాకర్ లు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ఈ నెల 10 వ తేదీన హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. సచివాలయం కూల్చి వేత పనులను నిలిపివేయాలని ఆదేశించింది. ఈ నెల 17వ తేదీ వరకు కూల్చివేత పనులపై స్టే ను పొడిగించింది హైకోర్టు.

ఇవాళ సచివాలయం కూల్చివేత పనులపై హైకోర్టు విచారణ చేయనుంది. సచివాలయం కూల్చివేత పనులపై పర్యావరణ అనుమతులు తీసుకోవాలా వద్దా అనే విషయమై స్పష్టత ఇవ్వాలని కేంద్రానికి నోటీసులు పంపింది. ఈ విషయమై ఇవాళ హైకోర్టులో విచారణ సాగనుంది.

click me!