తెలంగాణలో 40 వేలు దాటిన కరోనా: 24 గంటల్లో 1,676 కేసులు, 10 మంది మృతి

By Siva KodatiFirst Published Jul 16, 2020, 11:17 PM IST
Highlights

తెలంగాణలో కరోనా కేసులు 40 వేలు దాటాయి. ఇవాళ ఒక్కరోజే రాష్ట్రంలో 1,676 మందికి పాజిటివ్‌గా తేలినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 41,018 కి చేరింది.

తెలంగాణలో కరోనా కేసులు 40 వేలు దాటాయి. ఇవాళ ఒక్కరోజే రాష్ట్రంలో 1,676 మందికి పాజిటివ్‌గా తేలినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 41,018 కి చేరింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 13,328 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో 1,296 మంది డిశ్చార్జ్ అయ్యారు. వీరితో కలిపి ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 27,295కి చేరింది. ఇక గురువారం వైరస్ కారణంగా పది మంది మరణించడంతో, మొత్తం మృతుల సంఖ్య 396కి చేరుకుంది.

Also Read:విరసం నేత వరవరరావుకు కరోనా: ఆందోళనలో కుటుంబసభ్యులు

ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే అధికంగా 788 కొత్త కేసులు నమోదు కాగా.. రంగారెడ్డి 224, మేడ్చల్ 160, కరీంనగర్ 92, సంగారెడ్డి 57, ఖమ్మం 10, కామారెడ్డి 5, వరంగల్ అర్బన్ 47, వరంగల్ రూరల్ 1, మహబూబాబాద్ 19, మెదక్ 26, నల్గొండ 64, నాగర్ కర్నూల్ 30, నిజామాబాద్ 20, వనపర్తి 51, సూర్యాపేటలో ఐదుగురికి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

గురువారం నాడు విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో ఉచితంగా కరోనా టెస్టులు చేసే కేంద్రాలతో పాటు.. వివిధ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న పడకల వివరాలను పేర్కొన్నారు.

Also Read:కరోనా కలకలం: కోవిడ్‌తో హైద్రాబాద్‌లో మరో వజ్రాల వ్యాపారి మృతి

గాంధీ మెడికల్ కాలేజీ, ఉస్మానియా జనరల్ హాస్పిటల్, నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి, పంజాగుట్ట నిమ్స్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం), కాకతీయ మెడికల్ కాలేజీ (వరంగల్), హైదరాబాద్ సీసీఎంబీ, సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్‌ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్, ఈఎస్ఐసీ, రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్), ఆదిలాబాద్‌లో కరోనా టెస్టులు చేస్తున్నట్లు వివరించారు.

click me!