విచారణకు హాజరుకావాల్సిందే: రవిప్రకాష్‌కు సుప్రీం ఆదేశాలు

By narsimha lodeFirst Published Jun 3, 2019, 4:33 PM IST
Highlights

టీవీ 9 మాజీ సీఈఓ రవిప్రకాష్ పోలీసుల విచారణకు హాజరుకావాలని  సుప్రీంకోర్టు ఆదేశించింది. ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీం కోరింది.


న్యూఢిల్లీ:  టీవీ 9 మాజీ సీఈఓ రవిప్రకాష్ పోలీసుల విచారణకు హాజరుకావాలని  సుప్రీంకోర్టు ఆదేశించింది. ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీం కోరింది.

టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సోమవారం నాడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రవిప్రకాష్ తరపున అభిషేక్ మను సింఘ్వి వాదించారు.

ముందస్తు బెయిల్‌పై మెరిట్ ఆధారంగా  విచారణ జరపాలని సుప్రీంకోర్టు హైకోర్టును ఆదేశించింది. ముందస్తు బెయిల్‌పై హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీం రవిప్రకాష్‌కు సూచించింది.

జూన్ 10వ తేదీన ముందస్తు బెయిల్ పై విచారణ జరిపి ఆదేశాలు ఇవ్వాలని సుప్రీం కోర్టు హైకోర్టును కోరింది. 41 ఏ నోటీస్ కింద విచారణకు హాజరుకావాలని రవిప్రకాష్‌కు సుప్రీం సూచించింది. రవిప్రకాష్ ను అరెస్ట్ చేయాలంటే 48 గంటల ముందు నోటీసు ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.
 

click me!